Just NationalLatest News

Bank Strike Cancelled : బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్..3 రోజుల దేశవ్యాప్త సమ్మె వాయిదా..

Bank Strike Cancelled : డిమాండ్లపై సానుకూల వాతావరణం ఏర్పడటంతో ఆందోళన బాట వీడిన ఉద్యోగ సంఘాలు.. బ్యాంకులు ఎప్పటిలాగే తెరుచుకుంటాయని క్లారిటీ ఇవ్వడంతో ఖాతాదారులకు ఊరట లభించింది.

Bank Strike Cancelled

నెలాఖరులో లేదా కొత్త నెల ప్రారంభంలో ఎమర్జెన్సీ పని ఉండి బ్యాంక్‌కు వెళ్దామనుకున్న ఖాతాదారుల దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విషయం షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా మారిపోయింది.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) జరిపిన కీలక చర్చలు సఫలం కావడంతో సమ్మెను(Bank Strike Cancelled) టెంపరరీగా పక్కన పెడుతున్నట్లు బ్యాంకుల నుంచి ప్రకటన వచ్చింది. డిమాండ్లపై సానుకూల వాతావరణం ఏర్పడటంతో ఆందోళన బాట వీడిన ఉద్యోగ సంఘాలు.. బ్యాంకులు ఎప్పటిలాగే తెరుచుకుంటాయని క్లారిటీ ఇవ్వడంతో కస్టమర్లకు ఊరట లభించింది.

ఈ చర్చల్లో ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న అన్ని శనివారాలను అధికారిక సెలవులుగా ప్రకటించడం (5-Day Banking) అనే కీలక అంశంపైన పెద్ద పీట వేశారు. దీనిపై వెంటనే ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడానికి ఐబీఏ, యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో కూడిన ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. బ్యాంక్ ఉద్యోగులతో పాటు కస్టమర్లను కూడా దృష్టిలో పెట్టుకుని అందరికీ ఓకే అనిపించే విధంగా ఈ కమిటీ పర్ఫెక్ట్ సొల్యూషన్‌ను ప్రతిపాదించనుంది.

మరోవైపు పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌ సవరణలపై కూడా క్లారిటీ వచ్చింది. మెయిన్‌గా స్కేల్ 4, అంతకంటే పై స్థాయి అధికారుల పీఎల్‌ఐ పథకానికి సంబంధించి యూనియన్లు లేవనెత్తిన అభ్యంతరాలను, సవరణలను ఐబీఏ స్పెషల్‌గా పరిశీలించనుంది. కేంద్ర ప్రభుత్వానికి సరైన సవరణ ప్రతిపాదనలు పంపడానికి ఐబీఏతో మరిన్ని చర్చలు జరపడానికి మార్గం దొరికినట్లయింది. వీటితో పాటు గతంలో 2024 మార్చి 8 నాటి మినిట్స్ భేటీలో డిమాండ్ చేసిన మిగిలిన పెండింగ్ సమస్యలను కూడా వేగంగా పూర్తి చేయడానికి రెండు వర్గాలు అంగీకారానికి వచ్చాయి.

 Bank Strike Cancelled
Bank Strike Cancelled

ఐబీఏ ఇచ్చిన ఈ సానుకూల హామీలతో తాము 3 రోజుల పాటు చేయబోయే నిరసనలు, ధర్నాలు, సమ్మె(Bank Strike Cancelled) కార్యక్రమాలన్నింటినీ వెంటనే నిలిపివేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ నేతలు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకులన్నీ కూడా ఎలాంటి బ్రేక్ లేకుండా ఎప్పటిలాగే పనిచేయనున్నాయి.

INFJ Personality : మీరు కూడా INFJ పర్సనాలిటీకి చెందిన వారేనా?

Related Articles

Back to top button