Just TelanganaJust PoliticalLatest News

Khairatabad By Election : ఖైరతాబాద్‌పై కాంగ్రెస్ కన్ను.. రాజధానిలో హ్యాట్రిక్ స్కెచ్..

Khairatabad By Election : ఒక్క సీటు కూడా లేని పరిస్థితి నుంచి వరుసగా జరుగుతున్న ఉపఎన్నికల్లో గెలుస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ సిటీలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ మారుతుంది.

Khairatabad By Election

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎవరి టైమ్ ఎటు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు . మొన్నటి వరకూ రాజధాని హైదరాబాద్‌లో పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏకంగా గ్రేటర్ పీఠాన్నే షేక్ చేసే స్థాయికి చేరుకుంది. 2023 చివరిలో తెలంగాణ అంతా సునామీ సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. హైదరాబాద్ నగరంలో మాత్రం ఓటర్ నాడి పట్టుకోలేకపోయింది.

ఓల్డ్ సిటీ తప్ప గ్రేటర్ పరిధిలోని మిగిలిన అసెంబ్లీ సీట్లు అన్నిటినీ కూడా అప్పుడు బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. చివరకు మున్సిపల్ మేయర్ పీఠం కూడా గద్వాల విజయలక్ష్మి రూపంలో గులాబీ పాకెట్లోనే ఉండిపోయింది. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన లోక్‌సభ ఎలక్షన్స్‌లోనూ సిటీలోని మూడు ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌కు బోణీ కూడా కొట్టలేకపోయింది.

మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్, సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి బీజేపీ నుంచి జెండా ఎగరేస్తే, హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎప్పటిలాగే తమ హవా నిలబెట్టుకున్నారు. దీంతో రాజధానిలో అకౌంట్‌ తెరవలేక కాంగ్రెస్ పార్టీ దారుణంగా డిఫెన్స్‌లో పడిపోయింది.

అయితే ఇప్పుడు మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పొలిటికల్ పిక్చర్ కంప్లీట్‌గా మారిపోయింది. జీరో దగ్గర మొదలైన కాంగ్రెస్ గ్రాఫ్.. ఈ మూడేళ్లలోనే రాకెట్‌లా పైకి లేస్తోంది. ముందుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి గులాబీ జెండాను కాదని కాంగ్రెస్‌ గూటికి చేరడంతో అసలు సినిమా స్టార్ట్ అయింది.

ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఆ బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఊహించని విజయాన్ని సాధించడంతో సిటీలో హస్తం పార్టీ అకౌంట్ ఓపెన్ అయింది.

ఆ వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా బై ఎలక్షన్ అనివార్యమైంది. ఈ పోరులో కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ తిరుగులేని విక్టరీని సాధించి.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యను రెండుకి చేర్చారు.

అయితే ఇప్పుడు అందరి చూపు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంపైనే(Khairatabad By Election) పడింది. ఖైరతాబాద్‌లో(Khairatabad By Election) కూడా గెలిచి రాజధానిలో ముచ్చటగా మూడో విక్టరీని తమ అకౌంట్‌లో వేసుకోవాలని కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేస్తోంది.

Khairatabad By Election
Khairatabad By Election

2023లో బీఆర్ఎస్ నుంచి గెలిచి..తర్వాత కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన దానం నాగేందర్‌పై ఇటీవల కోర్టు అనర్హత వేటు వేయడంతో ఈ ప్లేస్ ఖాళీ అయింది. రాబోయే బై ఎలక్షన్‌లో హస్తం పార్టీ తరఫునే పోటీ చేసి మళ్లీ జెండా పాతేస్తానని దానం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ గెలిస్తే మాత్రం, సిటీలో వారి అసెంబ్లీ బలం ఏకంగా మూడుకి చేరుకుంటుంది.

ఒక్క సీటు కూడా లేని పరిస్థితి నుంచి వరుసగా జరుగుతున్న ఉపఎన్నికల్లో గెలుస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ సిటీలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ మారుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ (GHMC), మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్‌ పైన కూడా తమ రౌండ్ అప్ షురూ చేసింది. కాకపోతే ఈసారి హైడ్రా ఎఫెక్ట్‌తో ఓట్లు చేజారే అవకాశం కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Cut Off vs Space In Relationship : బంధాల్లో కట్ ఆఫ్ వర్సెస్ స్పేస్.. బంధాలలో బౌండరీలు దాటితే ఏమవుతుంది?

Related Articles

Back to top button