Just LifestyleLatest News

El Nino : ఎల్‌నినో ఎండలకి చెక్ పెట్టే చల్లటి మ్యాజిక్.. దట్టమైన పొగమంచు, చినుకుల జల్లుల వింత అనుభూతి..

El Nino : మంచు తుంపర్ల మధ్య అప్పుడప్పుడూ సన్నని జల్లులు కురుస్తూ ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతున్నాయి.

El Nino

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎల్‌నినో(El Nino) దెబ్బకి ఎన్నడూ లేనంతగా ఎండలు భగభగ మండిపోతుంటే, మరోవైపు ఒక్కసారిగా కాశ్మీర్ వంటి వింటర్ వైబ్స్‌ను ఇస్తుంది ఆ టూరిస్ట్ ప్లేస్. వినడానికే వింతగా ఉన్న ఈ అద్భుతం.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతీ రోజూ కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది.

చుట్టూ మండుతున్న ఉష్ణోగ్రతలను పక్కన పెడుతూ.. ప్రకృతి ఒడిలో దాగున్న పాడేరు ఏజెన్సీ మాత్రం చిరు ఎండ, దట్టమైన పొగమంచు అలాగే చినుకుల జల్లుల వింత అనుభూతితో విభిన్న వాతావరణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఒకే ప్రాంతంలో కనిపిస్తున్న వాతావరణ వింతలు, ఎత్తైన కొండల మధ్య ఊహించని రీతిలో ప్రత్యక్షమై.. శీతాకాలపు సొబగులుగా మారి పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.

మూడు రోజులుగా ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు మెల్లగా పడిపోతుండటంతో ..ఉదయాన్నే తెల్లటి దట్టమైన పొగమంచు ..నిండు దుప్పటిలా ఏజెన్సీని కప్పేస్తోంది. అలాగే ఆ మంచు తుంపర్ల మధ్య అప్పుడప్పుడూ సన్నని జల్లులు కురుస్తూ ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతున్నాయి. పచ్చని కొండల నడుమ కురిసే ఈ చినుకులు, చల్లటి గాలులు ఎల్‌నినో(El Nino) తాపంతో అల్లాడిపోతున్న పర్యాటకులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయి.

El Nino
El Nino

ఈ వండర్‌ఫుల్ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రకృతి ప్రేమికులు,టూరిస్టులు పాడేరు బాట పడుతున్నారు. పచ్చటి కోక కట్టినట్లు కనిపిస్తున్న కొండలు, సన్నటి మంచు చినుకులతో పాటు, పొగమంచులో తడిసి ముద్దయ్యే దారులు అక్కడకు వెళ్లిన వారిని కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నాయి.

డైలీ రొటీన్ లైఫ్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్ కావాలన్నా, అక్టోబర్‌లోనూ దంచికొడుతున్న ఎండల వేడి నుంచి తప్పించుకుని వింటర్ మ్యాజిక్‌ను ఫీల్ అవ్వాలన్నా.. అర్జంటుగా పాడేరు ఏజెన్సీ మీ నెక్స్ట్ డెస్టినేషన్ అవ్వాల్సిందే. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్‌లోనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఏజెన్సీ టూర్ ప్లాన్ చేసేయండి మరి.

Emotional Immaturity : ఎమోషనల్ ఇన్ మెచ్యూరిటీకి చెక్ పెట్టే 4 గోల్డెన్ రూల్స్

Related Articles

Back to top button