Just LifestyleLatest News

Red Flags In A Relationship : ఒకే రాత్రిలో బంధాలు తెగిపోవు..పచ్చని కాపురాన్ని కూల్చేసే 10 సైలెంట్ రెడ్ ఫ్లాగ్స్..

Red Flags In A Relationship : మీ బంధంలో కొన్ని రెడ్ ఫ్లాగ్స్‌లో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది విడాకుల వరకు దారితీసే అవకాశం ఉంటుంది.

Red Flags In A Relationship

సొసైటీలో కొన్ని జంటలు ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా, ఒకరికోసం ఒకరు జీవిస్తున్నారా అనేలా ఉంటూనే.. హఠాత్తుగా విడిపోయి అందరికీ షాకిస్తారు. దీంతో అంతా హ్యాపీగా సాగిపోతున్న వారి రిలేషన్‌ డైవోర్స్ వరకు ఎలా వెళ్లిందనే ప్రశ్న అందరిలోనూ వస్తుంది.

అయితే ఏ బంధం కూడా ఒక్క రాత్రిలోనో లేదంటే హఠాత్తుగానో ముగిసిపోదని సైకాలజిస్టులు అంటున్నారు. దంపతులకు తెలీకుండానే వారిలోకి ఎంటరయ్యే కొన్ని అలవాట్లు, సైలెంట్ రెడ్ ఫ్లాగ్స్(Red Flags In A Relationship) చాపకింద నీరులా ఆ బంధాన్ని తుంచేస్తాయి. స్టార్టింగ్‌లోనే ఈ కలుపు మొక్కలను గుర్తించి సాల్వ్ చేసుకోకపోతే, అవే అలవాట్లు పచ్చని కాపురాన్ని విడాకుల వరకు తీసుకెళ్తాయి.

వీటిలో మొదటిది కంపారిజన్ లేదా పోల్చడం.. మీ లైఫ్ పార్ట్‌నర్‌ను వేరేవాళ్లతోనో లేదంటే సోషల్ మీడియాలో కనిపించే రంగుల ప్రపంచంతోనో పోల్చడం స్టార్ట్ చేస్తే ఎలాంటి గాఢమైన ప్రేమైనా కరిగిపోతుంది.

రెండోది గొడవల కంటే ఎక్కువ డేంజర్ అయిన సైలెంట్ ట్రీట్మెంట్.. సమస్యలు ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడకుండా మౌనం వహించి వారిని దూరం పెట్టడం వల్ల ఎదుటి వ్యక్తి భరించరాని మానసిక నరకాన్ని అనుభవిస్తారు.

మూడోది ఒకరి మీద మరొకరికి గౌరవం లేకపోవడం.. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా గౌరవమనేది బంధంలో అస్సలు రాజీ పడకూడని విషయం.

నాలుగోది ఓవర్ గివింగ్ లేదా అవసరానికి మించి ఎదుటివ్యక్తిపై ప్రేమాభిమానాలను కురిపించడం.. ఇది పార్ట్‌నర్‌లో ప్రేమను పెంచకపోగా తేలిక భావం ఏర్పడి అది తనకే ఎలాగైనా దక్కుతుందనే ఎంటైటిల్మెంట్ మైండ్‌సెట్‌ను పెంచుతుంది.

ఐదోది చాలామంది ఇంట్లో కనిపించే ప్రధాన సమస్య ఫైనాన్షియల్ సీక్రెసీ.. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతీదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇద్దరూ సంపాదిస్తున్నా, కావాల్సినంత డబ్బు ఉన్నా ఆలోచనల్లో క్లారిటీ లేకపోవడం, ఆర్థిక విషయాలు దాచిపెడుతూ పార్ట్‌నర్ దగ్గర ట్రాన్సఫరెన్సీగా లేకపోవడంతో.. ప్రతీ చిన్న ఖర్చు దగ్గరా ఇంట్లో గొడవలు మొదలవుతాయి.

ఆరోది కమ్యూనికేషన్ గ్యాప్.. మనసులోని ఫీలింగ్స్‌ను, అసంతృప్తులను బయటపెట్టకుండా లోపలే దాచుకోవడం.. దీని వల్ల అది లోలోపల అసహనంగా మారి చిన్న విషయం కూడా ఒకేసారి పెద్ద అగ్నిపర్వతంలా బద్దలవుతుంది.

ఏడోది ఓవర్ పొసెసివ్‌నెస్.. పార్ట్‌నర్‌కు కొంత స్వేచ్ఛ ఇవ్వకుండా వారు చేసే ప్రతి చిన్న పని మీదా నిఘా పెట్టడం, ఫోన్‌లు చెక్ చేయడం వంటివి చేస్తే దీని వల్ల ఊపిరి ఆడనంత ఒత్తిడికి గురవుతారు.

ఎనిమిదోది క్షమాపణలు చెప్పకపోవడం లేదంటే ఈగో.. తానే తప్పు చేశానని తెలిసినా సారీ చెప్పడానికి పంతాలు పడితే రిలేషన్ కాస్తా ఈగోల యుద్ధభూమిగా మారుతుంది.

తొమ్మిదోది పార్ట్‌నర్ ప్రాధాన్యతలను లేదా వారు చేసే ప్రయత్నాలను తక్కువ చేసి చూడడం.. అవతలి వారు మీ కోసం చేసే చిన్న చిన్న పనులను కూడా గుర్తించకపోవడం వల్ల వారిలో నిరాశ నిండిపోతుంది.

Red Flags In A Relationship
Red Flags In A Relationship

ఇక పదోది హెల్దీ బౌండరీస్ లేకపోవడం. ఇది కూడా రిలేషన్‌ను దెబ్బతీస్తుంది.. దంపతుల మధ్యే కాకుండా చుట్టాలు, స్నేహితులు, చివరికి సొంత పేరెంట్స్ దగ్గర కూడా ఒక హెల్దీ లిమిట్ ఉండాలి. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే మీ ప్రైవసీని ఎప్పుడూ కాపాడుకోవాలి. దీనివల్ల పార్ట్‌నర్ ఇబ్బంది పడకుండా ఉంటారు.

వీటితో పాటు ఎప్పుడూ ఎదుటివారిని నిందిస్తూ.. బ్లేమ్ గేమ్ ఆడటం లేదంటే నేనే విక్టిమ్‌ను అని అందరిలోనూ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం చాలా డేంజర్(Red Flags In A Relationship). ఇక్కడ ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అని కాకుండా ఇద్దరికీ ఏది మంచిదనేది మాత్రమే ఆలోచించాలి.

మీ బంధంలో ఈ రెడ్ ఫ్లాగ్స్‌(Red Flags In A Relationship)లో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది విడాకుల వరకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ విషయాలను మీ పార్ట్‌నర్‌తో ఓపెన్‌గా షేర్ చేసుకుని, కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ఒక్కటే మార్గం అని తెలుసుకోవాలి.

Moroccan Red Clay : క్లియోపాత్రా బ్యూటీ సీక్రెట్ ఇదేనట.. ఈ నేచురల్ క్లే ఇంట్లోనే ఇలా వాడండి..

Related Articles

Back to top button