Just LifestyleLatest News

One-Sided Warnings : రిలేషన్‌షిప్‌లో ఒకరే అడ్జస్ట్ అవుతున్నారా..బంధాన్ని బర్నౌట్ చేసే 5 వన్ సైడెడ్ వార్నింగ్స్..

One-Sided Warnings : రిలేషన్‌ను నిలబెట్టుకోవడానికి, ముందుకు నడిపించడానికి ఎప్పుడూ ఒక్కరే హైరానా పడుతుంటే.. ఆ పర్సన్ విపరీతమైన మెంటల్ స్ట్రెస్‌కు, ఎమోషనల్ బర్నౌట్‌కు గురవుతారు

One-Sided Warnings

ఏదైనా ఒక రిలేషన్‌షిప్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్లాలంటే ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్, త్యాగాలు, అడ్జస్ట్‌మెంట్లు చాలా అవసరం. ముఖ్యంగా ఒక పార్ట్‌నర్ కష్టంలోనో, ఒత్తిడిలోనో ఉన్నప్పుడు మరొకరు అండగా నిలబడాలి.

అయితే వారిద్దరి మధ్య రిలేషన్‌ను నిలబెట్టుకోవడానికి, ముందుకు నడిపించడానికి ఎప్పుడూ ఒక్కరే హైరానా పడుతుంటే.. ఆ పర్సన్ విపరీతమైన మెంటల్ స్ట్రెస్‌కు, ఎమోషనల్ బర్నౌట్‌కు గురవుతారు. తాము ఎప్పుడూ త్యాగాలు చేస్తున్నా, తగ్గుతున్నా పార్ట్‌నర్ గుర్తించడం లేదని, తమను కేవలం ఒక డోర్ మ్యాట్‌లా వాడుకుంటున్నారనే ఫీల్ వారిని తొలి చేస్తుంది. మెల్లగా ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్( Emotional imbalance) వల్ల వారి రిలేషన్‌షిప్‌లో ఒకరు ఇచ్చేది ఎక్కువై, పొందేది శూన్యంగా మారుతుంది.

బంధంలో కాంప్రమైజ్ అవ్వడమనేది వన్ సైడ్ నుంచే సాగుతున్నప్పుడు అసలైన హెడ్డేక్ మొదలవుతుంది. చాలా చిన్న చిన్న విషయాలతోనే ఎప్పుడూ కూడా ఈ అలవాటు మొదలవుతుంది. ఉదాహరణకు ప్రతీసారి ఒకరే డేట్‌కు ప్లాన్ చేయడం, గొడవ జరిగినప్పుడు ప్రతీసారి ఒకరే తగ్గడం, ప్రతీసారి ఒకరే తమ ఇష్టాలను చంపుకుని పార్ట్‌నర్ ఇష్టాలకు ప్రయారిటీ ఇవ్వడం వంటి చిన్న నిర్ణయాల నుంచే ఇది పెరుగుతూ వస్తుంది.

సైకాలజీ ప్రకారం వారిది వన్-సైడెడ్ రిలేషన్‌షిప్(One-Sided Warnings) అని చెప్పడానికి 5 బలమైన సంకేతాలు ఉంటాయి. మొదటిది ఎప్పుడూ కూడా ఒకరే ప్లానర్ కావడం. ప్లానింగ్ అంటే కేవలం డబ్బు, టైమ్‌ కేటాయించడమే కాకుండా ఎమోషనల్‌గా అవైలబుల్‌గా ఉండటం కూడా ఇంపార్టెంట్ . కానీ ఇవేమీ రెండో పార్ట్‌నర్‌లో కనిపించవు.

రెండోది ఎప్పుడూ ఒకరే అడ్జస్ట్ అవుతూ ఉండటం. ఆఫీస్ షెడ్యూల్స్ మార్చుకోవడం, గొడవలు వద్దని సొంత ఇష్టాలను చంపుకోవడం, మిగిలిన అందరి కంటే వారే ఇంపార్టెంట్ అని ప్రయారిటీ ఇవ్వడం వంటివి చేస్తే వారి బౌండరీలను వారే దాటి ఒత్తిడికి గురవుతారు.

మీ సైడ్ నుంచి ప్రయత్నం చేయడం ఆపినప్పుడే ఆ అసమానత బయటపడటం మూడోది. మీరు మెసేజ్ చేయడం, కలవడానికి ఇంట్రెస్ట్ చూపించడం వంటివి ఆపేస్తే, అవతలి వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు.

మీ ఫీలింగ్స్‌ను, టెన్షన్స్‌ను లైట్ తీసుకోవడం నాలుగోది. మనస్పర్థలు వచ్చినప్పుడు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోకుండా.. టెన్షన్ తగ్గేవరకు దూరంగా ఉండి తర్వాత రావడం, సమస్యను సాల్వ్ చేసుకోకుండా దాటవేయడం మంచిది కాదు.

ఇక ఐదోది, ప్రేమ ప్లేస్‌లో ద్వేషం లేదా కోపం రావడం. ఎన్ని త్యాగాలు చేసినా,ఎంత తగ్గి వస్తున్నా అవతలి పర్సన్‌లో మార్పు రాకపోతే పార్ట్‌నర్ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని, అవతలి వ్యక్తిపై ప్రేమ తగ్గి కోపం, విసుగు పెరుగుతాయి.

One-Sided Warnings
One-Sided Warnings

ఇలాంటి వన్ సైడ్ రిలేషన్‌లో(One-Sided Warnings) ఎక్కువ కాలం పాటు కొనసాగితే అది వారి నిద్ర, ఏకాగ్రత, మొత్తం మెంటల్ హెల్త్‌పైనే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అవతలి పర్సన్ మారతాయని ఆశగా ఎదురుచూస్తూ గడపడం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.

అందుకే వీలయినంత తొందరగా ఆ బంధం నుంచి బయటపడితేనే మంచిది. లేదంటే ఒకవేళ ఆ రిలేషన్‌ను కంటిన్యూ చేయాలంటే మాత్రం కౌన్సెలింగ్ ద్వారా ఇద్దరి బాధ్యతలను, కమ్యూనికేషన్ బౌండరీలను సెట్ చేసుకుని లైఫ్‌లో ముందుకు వెళ్లడం మంచిది.

WhatsApp Schedule Messages : వాట్సాప్ యూజర్లకు కిల్లింగ్ ఫీచర్.. ఇకపై మెసేజ్‌లు ముందే షెడ్యూల్ చేయొచ్చు..

Related Articles

Back to top button