Pasta : పాస్తా ఎక్కువగా తింటున్నారా ?..ఈ విషయాలు తెలుసుకోకుంటే డేంజరే
Pasta : పాస్తా ఎక్కువగా తింటే రక్తపోటు, ఊబకాయం, మధుమేహ, పీసీఓడీ సమస్య వస్తాయని నిపుణులు చెబుతున్నారు
Pasta
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ అలవాటు చాలా నగరాల్లో బాగా పెరిగిపోయింది. యూట్యూబ్ లో వీడియోలు చూసి అందరూ ఫాస్ట్ ఫుడ్ వంటకాలనే ఫాలో అవుతూ అవే తింటున్నారు. ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు.
చాలా మంది ఎక్కువగా తినే ఫాస్ట్ ఫుడ్ వంటకాల్లో పాస్తా(Pasta) మొదటి స్థానంలో ఉంటుంది. రుచికరంగా బాగున్నా దీనిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాస్తా(Pasta) తరచుగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది. సాధారణంగా ఈ పాస్తా రిఫైన్డ్ పిండితో తయారవుతుంది.
దీనిని ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి, గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో ధీర్ఘకాలిక గుండె జబ్బులు రావొచ్చు. కాగా పాస్తా తయారీలో వాడే చీజ్, క్రీమ్ వంటి వాటిలో శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా పెంచుతాయి. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న వాళ్లు పాస్తాను ఎక్కువగా తీసుకోవడంతో ఊబకాయం బారిన పడుతున్నారు. పాస్తాలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉండటమే దీనికి కారణం.
అన్నింటికంటే ముఖ్యంగా మైదాతో తయారయ్యే పాస్తా సులభంగా జీర్ణం కాదు. మైదా పేగులకు అతుక్కుని మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. ప్రతీరోజూ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మందగించి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే రిఫైన్డ్ పాస్తాలో ఫైబర్, విటమిన్లు ఖనిజలవణాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఇది కేవలం కడుపు నింపుతుందే తప్ప శరీరానికి అవసరమైన పోషణను అందించదనేది వాస్తవం. కేవలం పాస్తానే ప్రధాన ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడి, రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. ఇక మధుమేహంతో బాధపడేవారు పాస్తాకు దూరంగా ఉండటం మంచిది. పాస్తాలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలోని చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి, షుగర్ కంట్రోల్ తప్పుతుంది.
ఆరోగ్యవంతులు దీనిని ఎక్కువగా తీసుకుంటే భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు మార్కెట్లో లభించే ప్యాకెట్ పాస్తాలో రుచి కోసం సోడియంను ఎక్కువగా కలుపుతారు. దానిని ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. పాస్తాను ఎప్పుడైనా ఒకటిరెండు సార్లు తింటే ఇబ్బందేమీ లేదనీ, రోజూవారీ ఆహారంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Memories: జ్ఞాపకాల భారంలో వర్తమానం నలిగిపోతుందా? దీని నుంచి ఎలా బయటపడాలి?





