Just Andhra PradeshJust PoliticalLatest News

Local Body Elections : పల్లెలు, పట్టణాల్లో ఎలక్షన్ ఫీవర్.. నిలిచిపోయిన 23 స్థానాల ఎన్నికల మాటేంటి?

Local Body Elections : ఎన్నికల పండుగ మధ్య ఏపీలోని 23 పురపాలక వర్గాలకు మాత్రం కోర్టు కేసులు, వివిధ రూపాలలలో బ్రేక్ పడింది.

Local Body Elections

ఏపీలో లోకల్ బాడీ పోరుకు ఎస్‌ఈసీ ఫైనల్ కౌంట్‌డౌన్ ప్రారంభించేసరికి ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. పట్టణాలు, పరిషత్‌లు, గ్రామ పంచాయతీల ఎలక్షన్స్‌కు సంబంధించిన ప్రణాళికను స్పష్టమైన తేదీలతో అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో పట్టణాల్లో ఎన్నికల వేడి ఇప్పటికే పీక్స్‌కు వెళ్లిపోయింది.

అక్టోబర్ 28వ తేదీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఓటింగ్ జరగనుండగా, అక్టోబర్ 30వ తేదీన ఫలితాలు రానున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంత పరిషత్ ఎలక్షన్‌కు సంబంధించి నవంబర్ 3వ తేదీన ఓటింగ్, నవంబర్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.

ఇక అత్యంత ఉత్కంఠ, అనుక్షణం టెన్షన్ అనేలా జరిగే గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నవంబర్ 26వ తేదీన ఫస్ట్ స్టేజ్‌, నవంబర్ 29వ తేదీన రెండో దశ, డిసెంబర్ 2న మూడో దశలో సాగనున్నాయి. ప్రతీ విడత కూడా ఓటింగ్ ముగిసిన వెంటనే ఎప్పటిలాగే అదే రోజు లెక్కింపు పూర్తి చేసి విజేతలను ప్రకటిస్తారు.

ఈ ఎన్నికల(Local Body Elections) పండుగ మధ్య ఏపీలోని 23 పురపాలక వర్గాలకు మాత్రం కోర్టు కేసులు, వివిధ రూపాలలో బ్రేక్ పడింది. వార్డుల డీలిమిటేషన్ ప్రాసెస్ పూర్తికాకపోవడం, సరిహద్దుల వివాదాలపై స్థానికులు కోర్టులను ఆశ్రయించడంతో ఎన్నికల సంఘం ఈ 23 చోట్ల ఎన్నికలను టెంపరరీగా వాయిదా వేసింది.

పెద్ద కార్పొరేషన్లయిన మంగళగిరి-తాడేపల్లి, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళంతో పాటు గుడివాడ, ఆముదాలవలస, రాజాం,తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, భీమవరం, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట,పొదిలి, కావలి, బాపట్ల, కందుకూరు, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలు, చింతలపూడి, బి.కొత్తకోట నగర పంచాయతీలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

ప్రస్తుతం ఆయా జిల్లాల యంత్రాంగాలు.. వార్డుల పునర్విభజన సవరణల పనులను స్పీడప్ చేస్తున్నాయి. కోర్టు కేసులు పరిష్కారమైన వెంటనే వీటికీ రెండో విడతలో ఎలక్షన్స్ కంప్లీట్ చేస్తామని ఎన్నికల(Local Body Elections) కమిషన్ వెల్లడించింది. దీంతో అక్కడ పోటీ చేయాలనుకుంటున్న నేతలు లీగల్ అప్‌డేట్స్ కోసం ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

DP Change : మీరూ తరచూ వాట్సాప్, ఇన్‌స్టా డీపీలు మారుస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..

Related Articles

Back to top button