Just SportsLatest News

Abhishek Sharma : టీ20ల్లో అభిషేక్ విధ్వంసం..సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా యంగ్ గన్..

Abhishek Sharma : ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్‌గా అభిషేక్ ప్రపంచ వేదికపై నయా రికార్డు క్రియేట్ చేశాడు.

Abhishek Sharma

భారత క్రికెట్ వర్ధమాన సెన్సేషన్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఇంటర్నేషనల్ టీ20ల్లో తన ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటమే కాకుండా రికార్డుల పుస్తకాలను తిరగరాస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ మ్యాచ్ ఓడిపోయినా కూడా, అభిషేక్ మాత్రం తన బ్యాట్ నుంచి జారవిడిచిన సిక్సర్‌తో ఒక అరుదైన వరల్డ్ రికార్డును తన పేరుతో లిఖించుకున్నాడు.

ఎందుకంటే ఈ ఏడాదిలో అభిషేక్‌కి ఇది 69వ సిక్సర్ కావడం విశేషం. దీని ద్వారా 2022 సంవత్సరంలో సూర్యకుమార్ యాదవ్ క్రియేట్ చేసిన 68 సిక్సర్ల ఆల్ టైమ్ రికార్డును అధిగమించి, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్‌గా అభిషేక్ ప్రపంచ వేదికపై నయా రికార్డు క్రియేట్ చేశాడు.

ఈ ఏడాది అభిషేక్‌ ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో 206కు పైగా మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో సుమారు వెయ్యి పరుగులకు చేరువయ్యాడు. వీటిలో ఒక మెరుపు సెంచరీతో పాటు ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం ఫాస్టెస్ట్ సిక్సర్ల రికార్డే కాకుండా, ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల పరంగా) 2,000 పరుగుల మైల్‌స్టోన్‌ను దాటిన భారత ఆరో బ్యాటర్‌గా కూడా అభిషేక్ నిలిచాడు.

రాబోయే రోజుల్లో టీమిండియా మరికొన్ని టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో హండ్రెడ్ సిక్సర్లు బాదిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆటగాడిగా అభిషేక్ శర్మ(Abhishek Sharma) నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

DP Change : మీరూ తరచూ వాట్సాప్, ఇన్‌స్టా డీపీలు మారుస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..

Related Articles

Back to top button