Bigg Boss Nominations : గేమ్ పెట్టి మరీ పర్సనల్ అటాక్స్.. ఈ వీక్ నామినేషన్స్‌లో బయటపడ్డ అసలు ఫేస్‌లు ..
Bigg Boss Nominations : రోహిత్ తాగిన వాటర్ బాటిల్‌ని చూసి ఆమె మురిసిపోవడం, షాలిని చెవిపోగులు పట్టుకుని రోహిత్ ఫీలైపోవడం చూస్తుంటే వీళ్ల మధ్య నడుస్తున్న ట్రాక్ ఎక్కడికి వెళ్తుందా అని ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.
Bigg Boss Nominations
బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ గెస్ చేయలేరు. మెయిన్‌గా ఈ వీక్ నామినేషన్స్ హీట్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. షాలిని ఎలిమినేట్ అయిందని నాగ్ చెప్పడంతో.. రోహిత్ పడిన ఓవర్ రియాక్షన్ చూసి జనాలు కూడా షాక్ అయ్యారు.
అటు ఆర్కే, అమన్ వచ్చి రోహిత్‌ను ఓదార్చడం ఒక కామెడీ అన్పిస్తే.. షాలిని మాత్రం సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిపోయి తనకు దక్కిన సెకండ్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. రోహిత్ తాగిన వాటర్ బాటిల్‌ని చూసి ఆమె మురిసిపోవడం, షాలిని చెవిపోగులు పట్టుకుని రోహిత్ ఫీలైపోవడం చూస్తుంటే వీళ్ల మధ్య నడుస్తున్న ట్రాక్ ఎక్కడికి వెళ్తుందా అని ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఇక అసలు సిసలు డ్రామా ఏడో వారం నామినేషన్స్(Bigg Boss Nominations)తో స్టార్ట్ అయింది. షాలిని కాళ్లు మొక్కడాన్ని తప్పుపట్టిన ఝాన్సీ.. రోహిత్‌ను నామినేట్ చేయడంతో గొడవ రాజుకుంది. దీనికి త్రిగుణ్, రోహిత్ ఎంట్రీ ఇచ్చి మరింత పెద్దది చేశారు. సారీ అడగడం తప్పా అంటూ రోహిత్ కవర్ చేసే ప్రయత్నం చేయగా.. ఆర్కే మధ్యలో దూరి మరి నువ్వు ముకేష్ విషయంలో ఎందుకు బోరున ఏడ్చావంటూ ఝాన్సీకి కౌంటర్ ఇచ్చాడు.
ఆ తర్వాత నీతూ, వర్షిణి మధ్య జరిగిన వార్ హౌస్‌ని షేక్ చేసింది. నువ్వు సింగిల్‌గా ఆడుతున్నావా అని నీతూ నిలదీస్తే.. బయట నుంచి ఇక్కడ గేమ్ చూసొచ్చి అక్కా తమ్ముడు అంటున్నావుగా అంటూ వర్షిణి కౌంటర్ ఇచ్చింది
రోహిత్ .. సుధీర్‌ని నామినేట్(Bigg Boss Nominations చేస్తూ.. డీల్స్ మాట్లాడారంటూ పెద్ద డైలాగ్స్ కొట్టాడు. అంతేకాదు తనకు పవర్ అక్కర్లేదని, తనే ఓ పవర్ అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. ఇక శివ ఎంట్రీ ఇచ్చి రోహిత్ ఆడిన ఆట మీద సెటైర్లు వేశాడు. ఇప్పటివరకు నువ్వు ఆడి గెలిచింది ఒక్క గేమ్ అయినా ఉందా అని నిలదీశాడు. స్క్రిప్ట్ అంటూ నువ్వు మాట్లాడే మాటలు ఎవరికోసమని రెచ్చిపోయాడు.
ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. త్రిగుణ్, రోహిత్ మధ్య మాటలు హద్దులు దాటాయి. చెల్లి అంటూ ఫేక్ రిలేషన్స్ పెట్టుకున్నావని రోహిత్ అంటే.. నోటికొచ్చినట్లు మాట్లాడకని త్రిగుణ్ రివర్స్ అయ్యాడు. మాట మాట పెరిగి ఒక స్టేజ్‌లో మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా అంటూ రోహిత్ ఫైర్ అవగా.. నువ్వు ఆ అమ్మాయి పాకెట్ దగ్గర చేయి పెట్టిన మాటేంటి అని త్రిగుణ్ దాన్ని బేస్ చేసుకుని పరువు తీసేలా మాట్లాడాడు.
ఆ మాటలతో రోహిత్ మీద పీకల మీదకి కోపం వచ్చిన త్రిగుణ్.. ఛీ నీదీ ఒక బతుకేనా, బయటికి వెళ్లి ఉరి వేసుకుని చచ్చిపో అని నోరుపారేసుకున్నాడు. మొత్తానికి ఈ వీక్ నామినేషన్స్ గేమ్ రూపాన్నే మార్చేసి, పరువు తీసే గొడవలుగా మారాయి.
Banana Flower : అరటి పువ్వులోని సీక్రెట్ హెల్త్ బెనిఫిట్స్.. తెలిస్తే అస్సలు వదలరు..





