Just LifestyleLatest News

Water Crises : భవిష్యత్తులో తీవ్ర నీటి,కరెంట్ కష్టాలు తప్పవు.. ఇప్పుడే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి..

Water Crises : భూగర్భ జలాలు ఇంకిపోతున్న ఈ సమయంలో డైలీ లైఫ్‌లో నీటిని ఎలా పొదుపు చేయాలో అలాగే నీటిని వృథా చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోండి.

Water Crises

ఎల్ నినో సృష్టిస్తున్న అలజడితో భూగర్భ జలాలు రోజురోజుకు ఎవరూ ఊహించనంత స్థాయిలో ఇంకిపోతున్నాయి. ఎండాకాలంలో రావాల్సిన వాటర్ ప్రాబ్లెమ్(Water Crises) ఇప్పుడే ముంచుకొస్తుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలను నిందించకుండా.. మనమే ముందుగా ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం, పొదుపుగా వాడుకోవడం చేస్తే భవిష్యత్తులో ఏర్పడే పెద్ద కష్టాన్ని ముందుగానే కాస్త తగ్గించుకున్నవాళ్లం అవుతాం.

దీని కోసం ముందుగా ప్రభుత్వం సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించవద్దని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్న సలహాను పాటించాలి. అంతేకాదు మనం చేసే ప్రతి చిన్న చిన్న పనుల్లో కూడా వాటర్ వేస్టేజ్‌కు అడ్డుకట్ట వేయడం ద్వారా భవిష్యత్‌లో మనకే కాదు మన ముందు తరాలకు నీటిని అందించొచ్చు.

చాలామంది టాప్‌లకు పైపు పెట్టి డైరెక్టుగా కార్లు, బైకులు కడుగుతుంటారు. దీనివల్ల కనీసం 90 నుంచి 100 లీటర్ల నీరు డ్రైనేజీలో కలిసిపోతున్నాయి. దీనికి బదులుగా బకెట్ వాటర్‌ తీసుకుని.. క్లాత్ తో శుభ్రం చేయడం వల్ల కేవలం 10- 20 లీటర్ల లోపు నీటితోనే సరిపెట్టొచ్చు. అంతేకాకుండా.. పైపుతో కడగడం వల్ల వెహికల్స్‌కు తుప్పుపట్టే అవకాశం కూడా ఉంది.

అలాగే షవర్ స్నానాలకు అందరూ గుడ్‌బై చెప్పి బకెట్, మగ్ వాడి స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. షవర్ ద్వారా వందల లీటర్లు వేస్ట్ అయితే, బకెట్‌తో 18-20 లీటర్లలోనే స్నానం పూర్తవుతుంది. గిన్నెలు కడిగేటపుడు, బ్రష్ చేసేటప్పుడు,షేవింగ్ చేసుకునేటప్పుడు ట్యాప్‌ను అలానే వదిలేయకుండా అవసరం అయినంత వరకే వాడాలి.

అలాగే కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయొచ్చు. బట్టలు ఉతకడానికి మామూలు టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ల కంటే ఫ్రంట్‌ లోడ్ వాషింగ్ మెషీన్లు 50 శాతం తక్కువ వాటర్‌ను వినియోగిస్తాయి. కాబట్టి వాటిని ఉపయోగించడానికి ట్రై చేయాలి. అలాగే చేతితో కడితే 90 లీటర్లు పోయే చోట డిష్‌ వాషర్‌ కేవలం 11 లీటర్ల వాటర్‌తో పనులు చక్కబెడుతుంది. ఆర్వో వాటర్ నుంచి లీకయ్యే వాటర్ సింక్‌లో వేస్టుగా పోనీకుండా.. బకెట్‌తో పట్టుకుని గిన్నెలు కడగడానికో ఇతర పనులకో వాడుకుంటే మంచిది.

అంతేకాకుండా ఇంట్లోని ట్యాప్‌లు, ఫ్లష్ ట్యాంకుల్లో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలి. లీకయ్యే ఒక చిన్న ట్యాప్ ద్వారా రోజుకు వంద లీటర్ల నీళ్లు వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క వాటరే(Water Crises) కాకుండా కరెంట్ కష్టాలకు కూడా ఇప్పటి నుంచే చెక్ పెట్టాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడే ఫ్యాన్స్, లైట్స్ వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏసీలను తక్కువగా వాడితే మంచిది.

Over Thinking : అతిగా ఆలోచిస్తున్నారా? అవతలి వారి మైండ్‌సెట్‌ను కూడా మీరే చదివేస్తున్నారా?

Related Articles

Back to top button