Just EntertainmentLatest News

Jailer 2 : సరికొత్త రికార్డులతో రజనీ విశ్వరూపం..2026 టాప్ హిట్స్‌లో జైలర్ 2

Jailer 2 : నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌కు రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడవ్వడంతో జైలర్ 2 మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

Jailer 2

ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసేలా బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ ఇస్తోంది. మూవీ విడుదలైన కేవలం 6 రోజుల స్వల్ప వ్యవధిలోనే వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 541 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 2026లో ఇప్పటి వరకు రిలీజైన ఇండియన్ మూవీల లిస్ట్‌లో మూడో అతిపెద్ద ఘనవిజయంగా దూసుకుపోతోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం.. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌కు రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడవ్వడంతో మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ మూవీ ఆరో రోజైన మంగళవారం ఒక్కరోజే ఇండియా వ్యాప్తంగా రూ. 45.55 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.

దీంతో దేశీయ మార్కెట్లో ఈ మూవీ మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 287.80 కోట్లకు అంటే దాదాపు రూ. 337 కోట్ల గ్రాస్‌కు చేరుకున్నాయి. దసరా పండుగ సెలవులు కలిసి రావడం జైలర్ 2(Jailer 2) కలెక్షన్లకు మరింత ఊపునిచ్చింది. కేవలం భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లలోనూ తలైవా మేనియా క్లియర్‌గా కనిపిస్తోంది. విదేశాల నుంచి దాదాపు రూ. 204 కోట్లు రావడంతో, వరల్డ్‌వైడ్ గ్రాస్ ఇట్టే రూ. 541 కోట్లను క్రాస్ చేసేసింది.

ఈ ఏడాది ఇప్పటికే భారీ వసూళ్లు సాధించిన ‘ధురంధర్ 2’ (రూ. 1,800 కోట్లకు పైగా), ‘దృశ్యం 3’ (రూ. 556 కోట్లు) మూవీల సరసన ఇప్పుడు ‘జైలర్ 2’ థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. సన్ పిక్చర్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, 2023లో సెన్సేషన్ విజయాన్ని సాధించిన ‘జైలర్’ సినిమాకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీనిలో రజనీకాంత్ మరోసారి పవర్‌ఫుల్ టైగర్ ముత్తువేల్ పాండియన్ రోల్‌లో అదరగొట్టగా.. ఆయనతో పాటు రమ్యకృష్ణ, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, యోగిబాబు వంటి మెయిన్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్..మూవీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ‘జైలర్’ లైఫ్‌టైమ్ రికార్డులను కూడా జైలర్ 2(Jailer 2) తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Hormonal Effect : హార్మోన్ల ఎఫెక్ట్ స్త్రీలకు మాత్రమేనా? ..ఏజ్‌తో పాటే ఎమోషనల్ హార్మోన్లు అందరిలోనూ మారతాయని తెలుసా?

Related Articles

Back to top button