Just LifestyleLatest News

Overly Emotional : ప్రతీ దానికి నొచ్చుకునే మనస్తత్వం..అతిగా ఫీలయ్యేవారి మైండ్ సెట్ వెనుకున్న సైకాలజీ ..

Overly Emotional : చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఫీలయ్యే వ్యక్తుల వెనుక ఎలాంటి మానసిక సమస్యలు ఉంటాయి? అలాంటి వారితో వ్యవహరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

Overly Emotional

మన చుట్టూ కొంతమంది మనుషులు ఉంటారు. వారి దగ్గరికి వెళ్లాలంటేనే తెలీకుండానే ఒకలాంటి టెన్షన్ స్టార్టవుతుంది. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడినా పొరపాటున ఏ చిన్న పదం నోరు జారినా క్షణంలో హర్ట్ అయిపోతారు.

ఒక క్షణం ముందు వరకు తమతో సరదాగా నవ్వుతూ మాట్లాడినవారే, పొరపాటున జారిన చిన్న పదానికి అలిగి మూలన కూర్చుంటే.. ఆ తర్వాత వారి దగ్గర ఏం మాట్లాడాలో తెలీక సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. పైకి ఇదొక చిన్న స్వభావంలా కనిపించినా, దీని వెనుక మానసిక సంఘర్షణ దాగి ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

మనుషులలో ఉండే ఈ అతి సెన్సిటివ్ బిహేవియర్‌ను సైకాలజీలో ఎమోషనల్ హైపర్-సెన్సిటివిటీ(Overly Emotional) లేదా పర్సనలైజింగ్ టెండెన్సీ అంటారు. ఎవరో ఒకరు ఎప్పుడూ తమను ఏదొక విషయంలో పాయింట్ అవుట్ చేస్తూనే ఉంటారనే ఒక బలమైన భయం (Rejection Trauma) వీరి ఆలోచనలను శాసిస్తుంటుంది.

దీనికి చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు, ఎమోషనల్ నెగ్లెక్ట్(Overly Emotional) లేదా కాన్ఫిడెన్స్ లోపించడం వల్ల వీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా తమ అస్తిత్వానికి తగిలిన దెబ్బలాగే భావిస్తారు. అవతలి వారు చాలా కేజువల్‌గా కేవలం ఒక సాధారణ అభిప్రాయాన్ని చెప్పినా సరే.. వీరు మాత్రం దాన్ని తనను కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా అన్నారనే ఫిక్స్ అయిపోతారు. తమను తాము కాపాడుకోవాలనే ప్రొటెక్షన్ ధోరణిలో భాగంగానే వీరు ఇలా రియాక్షన్ ఇస్తుంటారు.

ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అతిగా ఫీలయ్యే వ్యక్తులతో ప్రయాణమంటే కత్తి మీద సాములాంటిదే. అయితే, వారి ప్రవర్తనను చూసి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వారి ఈ సెన్సిటివిటీకి మనల్ని మనం బాధ్యులను చేసుకోవడం మానేయాలి.

వారితో ఎప్పుడు మాట్లాడినా కూడా నేరారోపణ చేసేలా కాకుండా, కాస్త హుందాగా, సానుభూతితో వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. అన్నింటికంటే మెయిన్‌గా, అవతలి వారి అనవసరమైన మూడ్ స్వింగ్స్ మనుషుల మెంటల్ పీస్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెడగొట్టకుండా స్ట్రాంగ్ ఎమోషనల్ బౌండరీస్‌ను (Emotional Boundaries) ఏర్పాటు చేసుకోవడమే బెస్ట్ సొల్యూషన్.

Secrets : నమ్మి సీక్రెట్ చెబితే ఊరంతా ఊదేస్తున్నారా? ఈ బిహేవియర్ వెనుక సైకాలజీ ఏంటి..

Related Articles

Back to top button