Virat – Anushka : విరాట్ ,అనుష్కల ఆశ్చర్యపరిచే ఆధ్యాత్మిక జర్నీ..పెళ్లి తర్వాత కొహ్లీలో మార్పు వచ్చిందా?
Virat - Anushka : గ్రౌండ్లో ఊహించని అగ్రెసివ్నెస్ ప్రదర్శించే విరాట్ కోహ్లీ తాజాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబైలో జరిగిన కృష్ణ దాస్ కీర్తన కార్యక్రమంలో కనిపించారు.ప్రశాంతమైన భక్తి పారవశ్యంలో కనిపిస్తున్న కోహ్లీ రెండో యాంగిల్‌ను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు.
Virat – Anushka
క్రీజ్‌లో అడుగుపెట్టాక విరాట్ కోహ్లీ కనిపించడు.. కేవలం ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే అగ్నిపర్వతమే కనిపిస్తుందంటారు కోహ్లీ ఫ్యాన్స్ . కానీ అదే కోహ్లీ కళ్లు మూసుకుని, ప్రశాంతమైన మనస్సుతో భక్తి సంగీతంలో మైమరిచిపోయి కనిపిస్తున్నవిజువల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
ముంబైలో ప్రముఖ అమెరికన్ భక్తి సంగీత గాయకుడు కృష్ణ దాస్ నిర్వహించిన కీర్తన కార్యక్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క(Virat – Anushka) శర్మ పాల్గొనడమే కాకుండా, భక్తి పారవశ్యంలో మునిగితేలడం ఎంతోమందిని ఆకట్టుకుంది. పక్కనే ఉన్న అనుష్క శర్మ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ రాధే రాధే నామస్మరణ చేయగా, కోహ్లీ మాత్రం కళ్లు మూసుకుని కీర్తనను ఆస్వాదిస్తూ కనిపించిన దృశ్యాలు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
అక్టోబర్ 25వ తేదీన ముంబైలోని వర్లీ ఎస్వీపీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సాయంత్రపు కృష్ణ దాస్ ప్రత్యక్ష కీర్తనకు విరుష్క జంట హాజరైంది. అయితే ఈ జంట కృష్ణ దాస్ కీర్తనల్లో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. జులై 2026లో లండన్ యూనియన్ ఛాపెల్‌లో జరిగినపుడు కూడా వీరిద్దరూ వెళ్లారు.అయితే ఒకప్పుడు పెద్దగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పెద్దగా కనిపించని కోహ్లీ పెళ్లి తర్వాత తరచూ కనపడటంపై నెట్టింట్లో పెద్ద చర్చే జరుగుతుంది.
2022 చివరి నుంచి కూడా కొహ్లీ, అనుష్క(Virat – Anushka) కలిసి చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలను సందర్శిస్తున్నారు. నవంబర్ 2022లో మొట్టమొదటి సారిగా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ నీమ్ కరోలీ బాబా కైంచీ ధామ్ ఆశ్రమాన్ని వీరిద్దరూ సందర్శించడంతో వీరి ఆధ్యాత్మిక ప్రయాణం అప్పట్లో చర్చనీయాంశమైంది.
అలాగే జనవరి 2023లో తమ కుమార్తె వామికాతో కలిసి బృందావనానికి వెళ్లిన విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ..అక్కడ నీమ్ కరోలీ బాబా ఆశ్రమంతో పాటు ప్రసిద్ధ గురువు ప్రేమానంద్ మహారాజ్‌ను కూడా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అదే నెల చివర్లో రిషికేశ్‌లోని స్వామి దయానంద గిరి ఆశ్రమానికి కూడా వెళ్లి, దయానంద సమాధిని దర్శించుకోవడమే కాదు..దాదాపు వంద మంది సాధువులకు స్వయంగా అన్నదాన ఏర్పాట్లను చేశారు.
అంతేకాదు మార్చి 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ఇండోర్ టెస్టు ముగిసాక.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించడమే కాకుండా అక్కడ ప్రత్యేక పూజల్లో కొహ్లీ, అనుష్క పాల్గొన్నారు. ఇక బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్‌తో వీరి అనుబంధం ప్రత్యేకమైనదిగా చెబుతారు. జనవరి 2023 తర్వాత, జనవరి 2025లో తమ పిల్లలతో కలిసి మళ్లీ ప్రేమానంద్ మహారాజ్‌ను దర్శించుకున్నారు.

ముఖ్యంగా మే 2025లో టెస్టు క్రికెట్ నుంచి విరాట్ రిటైర్మెంట్ ప్రకటించిన మర్నాడే, అనుష్కతో కలిసి శ్రీహిత్ రాధా కేలి కుంజ్ ఆశ్రమంలో ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు పొందారు. అలాగే ఫిబ్రవరి 2026లో కూడా వీరు బృందావనంలో మళ్లీ ప్రత్యక్షమయ్యారు.
గ్రౌండ్లో చూపించే పవర్ఫుల్ అగ్రెషన్, గెలవాలనే కసితో కనిపించే కోహ్లీని చూసే అభిమానులకు.. ఈ కీర్తనలు, ఆశ్రమ సందర్శనల్లో కనిపించే కొహ్లీ ప్రశాంత రూపం ఒక కొత్త కోణాన్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. విరాట్,అనుష్కల ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక జర్నీ, వారి పర్సనాలిటీలలో ఉన్న న్యూ బ్యాలెన్స్‌ను ప్రపంచానికి క్లియర్‌గా చూపిస్తుంది.





