Just Andhra PradeshLatest News

Arnab Cyclone : దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం..

Arnab Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపానుపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు, సహాయక చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.

Arnab Cyclone

తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుపాను(Arnab Cyclone) ముప్పుతో ఏపీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ నెల 28వ తేదీన యానాం వద్ద తుపాను తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో, లోతట్టు ప్రాంతాలు , తీరప్రాంత ప్రజల రక్షణ కోసం భారీ స్థాయిలో సహాయక చర్యలను రంగంలోకి దించింది. క్షేత్రస్థాయి పరిణామాలను సీఎం చంద్రబాబు స్వయంగా కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఈ తుపాను(Arnab Cyclone) కారణంగా ఏపీలోని ఉత్తర కోస్తా నుంచి నెల్లూరు వరకు ఉన్న పదికి పైగా జిల్లాల్లో రాబోయే 2 రోజులు విస్తారంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో మానవతా కోణంలో స్పందించిన కూటమి ప్రభుత్వం.. ముఖ్యంగా సుమారు 4,711 మంది గర్భిణీలను గుర్తించి, ప్రమాదం లేని సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించే బాధ్యతను పూర్తి చేస్తోంది. దీంతో పాటు వృద్ధులు,చిన్నారులు, వికలాంగులను ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు చేర్చుతున్నారు.

ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడటానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను ఎన్టీఆర్, విశాఖపట్నంతో పాటు 11 సున్నితమైన జిల్లాల్లో మోహరించారు. అవసరమైతే నావికాదళం, కోస్ట్ గార్డ్ దళాలను రంగంలోకి దించేలా సమన్వయం చేస్తున్నారు. మరోవైపు వర్షాల వల్ల సుమారు 1.82 లక్షల హెక్టార్లలోని ఉద్యాన పంటలు, రైతులు కోసిన ధాన్యం పాడవకుండా కాపాడటానికి వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

కరెంట్ కోతలు, విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఆయా శాఖల సిబ్బందికి అత్యవసర సామగ్రితో శిక్షణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను భయాందోళనలకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ స్కూల్‌ అండ్ కాలేజీల సెలవులపై నిర్ణయం తీసుకునే నిర్ణయాన్ని పూర్తిగా స్థానిక కలెక్టర్లకే అప్పగించింది. .

Overly Emotional : ప్రతీ దానికి నొచ్చుకునే మనస్తత్వం..అతిగా ఫీలయ్యేవారి మైండ్ సెట్ వెనుకున్న సైకాలజీ ..

Related Articles

Back to top button