Electric Bike Charging : రైడ్ నుంచి రాగానే ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే..
Electric Bike Charging : ఎలక్ట్రిక్ స్కూటర్ వాడిన వెంటనే ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఏమవుతుందో తెలుసా? బ్యాటరీ లైఫ్ రెట్టింపు చేయడానికి ఐఐటీ మద్రాస్ నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలు, నివారణ మార్గాలు ఇక్కడ చూడండి.
Electric Bike Charging
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు భయపడి చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు షిఫ్ట్ అయిపోతున్నారు. అందుకే ఇప్పుడు రోడ్లపై ఎటు చూసినా సైలెంట్‌గా దూసుకెళ్లే ఈవీ బైక్‌లే హల్ చల్ చేస్తున్నాయి. అయితే బయట రైడ్ ముగించుకుని ఇంటికి రాగానే వెంటనే ఛార్జింగ్(Electric Bike Charging) ప్లగ్ పెట్టేస్తూ చాలామంది పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. పైకి ఇది చాలా నార్మల్ అలవాటులానే అనిపించినా, దీనివల్ల మెల్లమెల్లగా బ్యాటరీ ఆయుష్షు దారుణంగా పడిపోతుంది . అంతేకాకుండా కొన్నిసార్లు బైక్ తగలడిపోయే ప్రమాదం కూడా ఉందని టెక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
అసలు స్కూటర్ వాడిన వెంటనే ఛార్జింగ్ పెడితే ఏమవుతుందనే విషయాన్ని సైంటిఫిక్ రీజన్లో చూస్తే.. ఈవీ వెహికల్స్‌లో వాడే లిథియం అయాన్ బ్యాటరీల్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల నేచురల్‌గానే హీట్ జనరేట్ అవుతుంటుంది. రోడ్డుపై డ్రైవ్ చేసి రాగానే ఆ రాపిడికి అప్పటికే ఆ బ్యాటరీ ఫుల్ వేడిగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఛార్జింగ్ వైర్ కనెక్ట్ చేస్తే, ఆ ఛార్జింగ్(Electric Bike Charging) హీట్ కూడా తోడవడంతో.. బ్యాటరీ టెంపరేచర్ ఒక్కసారిగా పీక్స్‌కి చేరిపోతుంది.
ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జర్లు వాడినప్పుడు ఈ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా తయారవుతుంది. మన దగ్గర ఉండే 40 -45 డిగ్రీల ఎండల తీవ్రతకు ఈ ఓవర్ హీట్ కూడా తోడైతే, బ్యాటరీ లోపల డేంజరస్ కెమికల్ రియాక్షన్స్ జరిగి ఫైర్ యాక్సిడెంట్లు జరిగే డేంజర్ కూడా ఉందని ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజనీర్స్ చెబుతున్నారు.
ఇక్కడే ఎలక్ట్రిక్ కార్లలో రాని ఈ ప్రాబ్లెం ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్లలోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తోందనే డౌట్ చాలామందిలో వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఎలక్ట్రిక్ కారులో ఉండే కూలింగ్ సిస్టమ్. అంటే ఈవీ కార్లలో బ్యాటరీ టెంపరేచర్‌ను కంట్రోల్లో ఉంచడానికి లిక్విడ్ లేదా యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీని వాడతారు. కానీ స్కూటర్ల సైజ్ చిన్నగా ఉండటం, పైగా నార్మల్ బైక్స్ కంటే కూడా వెయిట్ తక్కువగా ఉండాలనే కాన్సెప్ట్ వల్ల కేవలం బయటి గాలి ద్వారా చల్లబడే ఎయిర్ కూలింగ్ సిస్టమ్ మాత్రమే దీనికి ఇస్తున్నారు. అందుకే ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు చాలా ఫాస్ట్‌గా హీట్ ఎక్కిపోతుంటాయి.
ఈ ప్రాబ్లెమ్‌కు పర్ఫెక్ట్ సొల్యూషన్ కనిపెట్టడానికి రీసెర్చర్లు దీనిపైన ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. మెయిన్‌గా బ్యాటరీని ఒక ప్రత్యేక లిక్విడ్‌లో ఉంచి కూల్ చేసే ఇమ్మర్షన్ కూలింగ్ మెథడ్స్‌పై కూడా రీసెర్చ్ సాగుతోంది. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మార్కెట్లోకి రావడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి, ఈలోపు ఈవీ స్కూటర్ ఓనర్లు కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే సరిపోతుంది.
జర్నీ చేసి కాస్త ఓపిక పట్టి కనీసం అరగంట పాటు అయినా వెయిట్ చేయాలి. బ్యాటరీ నార్మల్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాతే ఛార్జింగ్ పెట్టాలి అనే పద్ధతిని ఫాలో అవ్వాలి. వెహికల్‌ను ఎప్పుడూ డైరెక్ట్ ఎండలో కాకుండా నీడగా ఉన్న చోటే పార్క్ చేయాలి. అలాగే ప్రతీరోజూ 100 శాతం ఛార్జింగ్ చేయకుండా.. 80 శాతం వరకు ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ చాలా ఏళ్ల పాటు బాగుంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ సేఫ్‌గా ఉండటంతో పాటు.. బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.





