Anirudh – Kavya Maran Wedding Invitation : అనిరుధ్, కావ్య మారన్ వెడ్డింగ్ కార్డ్ చూశారా? ట్రెండ్ అవుతున్న ఇన్విటేషన్ కార్డ్..
Anirudh - Kavya Maran Wedding Invitation : మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ఎస్ఆర్హెచ్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వేడుకల అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. గ్రీస్‌లో వివాహం, చెన్నైలో రిసెప్షన్, వైరల్ వెడ్డింగ్ కార్డ్ విశేషాల గురించి నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది.
Anirudh – Kavya Maran Wedding Invitation
టాలీవుడ్, కోలీవుడ్, స్పోర్ట్స్ సర్కిల్స్‌లో ఇప్పుడు హాటెస్ట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్(Anirudh – Kavya Maran Wedding Invitation) పెళ్లి ముచ్చటే అవుతుంది. తాజాగా ఈ హై-ప్రొఫైల్ కపుల్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డ్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతూ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఐవరీ కలర్, లైట్ బ్లూ షేడ్స్ కాంబినేషన్లో బరోక్ స్టైల్లో డిజైన్ చేసిన ఈ ఆహ్వాన పత్రికను చూడటానికి చాలా రాయల్‌గా, ఆర్టిస్టిక్‌గా ఉంటూ అందరి దృష్టిని తెగ అట్రాక్ట్ చేస్తోంది.
ఈ ఇన్విటేషన్ కార్డ్(Anirudh – Kavya Maran Wedding Invitation)ను ఓ బ్యూటిఫుల్ ప్రీమియం బాక్స్‌లో ప్యాక్ చేయగా, దానిపై లైట్ బ్లూ కలర్ డిజైన్లు, గోల్డెన్ కలర్ ఎంబెల్లిమెంట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. వాటిపై చేసిన ఎంబోస్డ్ వర్క్, వింటేజ్ వైబ్స్‌తో ఉన్న క్లాసిక్ ముద్రలు ఈ డిజైన్‌కు నెక్స్ట్ లెవెల్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. ఈ వండర్ఫుల్ ఇన్విటేషన్ కార్డును డిజైన్ చేసిన ‘పింక్ విసిల్ మ్యాన్’ సంస్థకు చెందిన రంజని అయ్యంగార్ సోషల్ మీడియా వేదికగా ..ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు.
నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్ దేశంలోని ఓ క్రేజీ లొకేషన్లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లిని చాలా ప్రైవేట్‌గా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే పెళ్లి తేదీలు, లొకేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
View this post on Instagram
కాగా వెడ్డింగ్ రిసెప్షన్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. నవంబర్ 21వ తేదీన చెన్నై వేదికగా ఈ మెగా రిసెప్షన్ జరగబోతోంది. మరోవైపు అనిరుధ్, కావ్య పాప క్రేజీ జోడీ పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Unstoppable With NBK Season 5 : ఆహా ప్లాన్ అదిరింది.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేలో మెగాస్టార్?





