Just TelanganaLatest News

Telangana Weather : తెలంగాణకు అలర్ట్.. 2 రోజుల పాటు భారీ ఈదురుగాలులతో వర్షాలు

Telangana Weather : అర్నబ్ తుపాను ఎఫెక్ట్‌తో తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. రాబోయే 2 రోజులు మోస్తరు వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది

Telangana Weather

ఇప్పటికే కోస్తాంధ్రను కంపింపజేస్తున్న తీవ్రమైన అర్నబ్ తుపాను ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణపై కూడా క్లియర్‌గా కనిపిస్తోంది. తుపాను ధాటికి తెలంగాణ వ్యాప్తంగా పగటిపూట టెంపరేచర్లు ఊహించని విధంగా గణనీయంగా పడిపోయాయి. తుపాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, అలాగే గంటకు 30 – 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది.

తుపాను కారణంగా రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌ జిల్లాలలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. తాజాగా ముసురు వాతావరణం ఏర్పడి మరి కొన్ని జిల్లాల్లో తేలికపాటి చినుకులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా డే టెంపరేచర్లు సాధారణం కంటే ఘోరంగా పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఏకంగా 1.5 డిగ్రీల నుంచి 5.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలలో తేడా కనిపించింది. కాగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా చలి తీవ్రత, వాతావరణంలో తేమ శాతం ఒక్కసారిగా పెరిగాయి.

ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు బలమైన చలిగాలులు వీస్తుండటంతో వాహనదారులు, మెయిన్‌గా బైక్స్‌పై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హఠాత్తుగా తగ్గిన టెంపరేచర్స్‌ వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Maturity : నిజమైన మెచ్యూరిటీ అంటే ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుంది?

Related Articles

Back to top button