Chicken And Eggs : నాన్‌వెజ్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. వీకెండ్లో పడిపోయిన చికెన్, గుడ్ల ధరలు
Chicken And Eggs : తెలుగు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా పడిపోయిన చికెన్ , కోడిగుడ్ల ధరలు. హైదరాబాద్, విజయవాడ జోన్ల రేట్లు, మార్కెట్ పతనానికి కారణాలు ఇక్కడ తెలుసుకోండి.
Chicken And Eggs
నెల రోజులుగా చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు ఒక్కసారిగా దిగిరావడం నాన్‌వెజ్ లవర్స్‌కు రిలీఫ్‌ను ఇస్తోంది. సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చికెన్ డిమాండ్ పెరిగిపోవడంతో వ్యాపారులు రేట్లను అదే రేంజ్లో పెంచేస్తుంటారు. కానీ ప్రస్తుతం పౌల్ట్రీ మార్కెట్లో దీనికి పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.
లాస్ట్ వీక్ వరకూ కేజీ చికెన్ రూ.300 వరకు చేరుకుని పేద,మధ్యతరగతి జనాలను భయపెట్టగా, ఇప్పుడు రూ.50 వరకు తగ్గి రూ.250కి పడిపోయి గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే దీపావళి, ఆ తర్వాత రోజు నుంచి పవిత్ర కార్తీక మాసం స్టార్ట్ కానుండటంతో ప్రజలు నాన్‌వెజ్ వినియోగాన్ని భారీగా తగ్గించనున్నారనే అంచనాలతోనే ఈ ధరల పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ జోన్లో కేజీ స్కిన్లెస్ చికెన్ కాస్ట్ రూ.252 పలుకుతుండగా, డ్రస్స్‌డ్ చికెన్ మాత్రం రూ.223గా, రిటైల్ లైవ్ బర్డ్ రూ.144గా, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.117గా అమ్ముతున్నారు. ఇక కరీంనగర్ జోన్‌లోనూ ఇంచుమించు అవే ధరలతో స్కిన్లెస్ చికెన్ కాస్ట్ రూ.252 ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ రూ.144, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.117 కు కొంటున్నారు.
కాగా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ జోన్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.266 ధర ఉండగా, డ్రస్స్‌డ్ విత్ స్కిన్ రూ.236గా, రిటైల్ లైవ్ బర్డ్ రూ.152గా, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.125గా అమ్ముతున్నారు.
చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు(Chicken And Eggs) కూడా తగ్గడంతో హైదరాబాద్, విజయవాడ జోన్లలో డజన్ గుడ్ల ధర రూ.80కి అమ్ముతున్నారు. ఈ ధరల తగ్గుదల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులకు పెద్ద ఊరటనిస్తోంది. అయితే ఈ పరిణామం మాత్రం పౌల్ట్రీ రైతుల ఇన్‌కమ్‌పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని.. రానున్న రోజుల్లో డిమాండ్ మరింత తగ్గితే ధరలు మరింతగా దిగివచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Passive Resistance : చెప్పినవన్నీ చేస్తామంటారు..కానీ నచ్చిందే చేస్తారు.. మీరూ అదే టైపా?





