Gen Z Love Rules : నువ్వు లేకపోతే నేను లేను సీన్స్ బంద్..జెన్ జెడ్ సరికొత్త లవ్ రూల్స్ ఇవే..
Gen Z Love Rules : జెన్ జెడ్‌కు లవ్, ఎమోషనల్ అటాచ్మెంట్, రిలేషన్ కావాలి కానీ.. దానికి మూల్యంగా తమ పర్సనల్ లైఫ్‌ను పణంగా పెట్టడానికి మాత్రం ఇప్పటి వాళ్లు అస్సలు రెడీగా ఉండటం లేదు.
Gen Z Love Rules
నువ్వు లేకపోతే నేనూ లేను, నువ్వే నా సర్వస్వం, నీ కోసం నా ఉనికినే వదులుకుంటా.. తరతరాలుగా, మెయిన్‌గా మన మూవీలు మన మైండ్‌లో బలంగా నాటుకున్న లవ్ డెఫినిషన్లు ఇవి. లవ్ చేస్తే చాలు మన ఐడెంటిటీని మొత్తం ఆ రిలేషన్షిప్లోనే కరిగించేయాలనే ఓ డ్రామటిక్ థాట్ ప్రాసెస్ దశాబ్దాలుగా ఇద్దరి మధ్య ఏలుతోంది.
కానీ ప్రెజెంట్ ఇయర్ 2026 లో కాలంతో పాటు పరిస్థితులు మారిపోగా వాటి వల్ల ప్రేమ స్వరూపం కూడా పూర్తిగా మారిపోయింది. ప్రేమలో పడటమంటే మనల్ని మనం కోల్పోవడం కాదనే ఒక బోల్డ్ ప్రాక్టికల్ విప్లవాన్ని ఇప్పటి జెన్ జెడ్ తరం స్టార్ట్ చేసింది.
పూర్వం ఒకరిని లవ్ చేస్తే 24 గంటలు కూడా వాళ్లతోనే స్పెండ్ చేయడం, ఒకే ఫ్రెండ్ సర్కిల్ మెయింటెన్ చేయడం, ప్రతీ డెసిషన్ ఇద్దరూ కలిసే తీసుకోవడం వంటివి ఉండేవి. దీనివల్ల మెల్లగా పార్ట్నర్స్లో తమకంటూ ఉన్న ఓన్ గుర్తింపు కాస్తా ఆ రిలేషన్షిప్లో కలిసిపోయేది.
కానీ జెన్ జెడ్‌కు లవ్, ఎమోషనల్ అటాచ్మెంట్, రిలేషన్ కావాలి కానీ.. దానికి మూల్యంగా తమ పర్సనల్ లైఫ్‌ను పణంగా పెట్టడానికి మాత్రం ఇప్పటి వాళ్లు అస్సలు రెడీగా ఉండటం లేదు. లవ్‌లోకి ఎంటర్ అవ్వకముందు తమకు ఉన్న కెరీర్, ఫ్రెండ్షిప్స్, ఆశయాలు, పర్సనల్ స్పేస్ మాత్రం అలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇది కమిట్మెంట్ నుంచి పారిపోవడం కాదని.. కాకపోతే తనను తాను కోల్పోకుండా తనను ప్రేమిస్తాననే ఒక హెల్దీ థాట్ ప్రాసెస్ ఇది అని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ఒకప్పుడు ప్రతీ క్షణం పార్ట్నర్తోనే స్పెండ్ చేయడం లవ్‌కు సింబల్‌గా భావించేవారు. కానీ ఇప్పుడు రోజంతా కలిసే ఉండాల్సిన అవసరం లేదని, ఇద్దరి మధ్య గ్యాప్ లేదా ఇండిపెండెన్స్ ఉన్నంత మాత్రాన లవ్ తగ్గిపోయినట్లు కాదని జెన్ జెడ్ భావిస్తోంది. వేర్వేరు ఫ్రెండ్స్ ఉండటం, సోలోగా ట్రావెల్ చేయడం, సొంత హాబీలను ఫాలో అవ్వడం, కొద్దిసేపు కూల్‌గా ఒంటరిగా టైమ్ గడపడం వంటివి రిలేషన్‌ను మరింత స్ట్రాంగ్ చేస్తాయని వీళ్లు నమ్ముతున్నారు. ఈ రోజుల్లో కాంపాటిబిలిటీ అంటే కేవలం ఒకేలాంటి ఆలోచనలు ఉండటమే కాదు.. ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్‌ను గౌరవిస్తూ, ఒకరి గ్యాప్‌ను మరొకరు రెస్పెక్ట్ చేయడం కూడా అని అర్థం వచ్చేలా ప్రవర్తిస్తున్నారు.
అలాగే ఒక పార్ట్నర్ వచ్చి మన లైఫ్‌ను పూర్తి చేస్తారనే పాత ఫీలింగ్ మెల్లగా మాయమవుతోంది. మనం ఆల్రెడీ బిల్డ్ చేసుకుంటున్న లైఫ్‌కి ఒక పార్ట్నర్ అదనపు హ్యాపీనెస్ ఇవ్వాలి తప్ప, వాళ్లే మన పూర్తి లైఫ్‌గా మారిపోకూడదు. కెరీర్, ప్యాషన్, ఫ్యామిలీ, పర్సనల్ గోల్స్ ఇవన్నీ ఒక మనిషి ఐడెంటిటీని డిఫైన్ చేస్తాయి. నువ్వు లేకపోతే నేను బతకలేననే డిపెండెన్సీ కంటే.. నేను ఒంటరిగా సంతోషంగా ఉన్నాను, కానీ నా లైఫ్‌ని నీతో పంచుకోవడం నాకు ఇష్టం అనే క్లారిటీతో ఉన్నప్పుడే ఆ రిలేషన్ చాలా స్ట్రాంగ్‌గా మారుతుంది.
జెన్ జెడ్ తీసుకొచ్చిన ఈ పెద్ద చేంజ్(Gen Z Love Rules) ఏంటంటే.. సీరియస్ కమిట్మెంట్ని, పర్సనల్ ఫ్రీడమ్‌ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. వేర్వేరు ఆలోచనలు ఉన్నా ఒకే రకమైన వ్యాల్యూని కలిగి ఉండటం, విడిగా టైమ్ గడిపినా ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉండటం, ఒకరి గ్రోత్‌ను చూసి మరొకరు గర్వపడటం దీనిలో ముఖ్యమైన విషయాలు. బంధనాలు లేని తోడు, డిపెండెన్సీ లేని అటాచ్మెంట్, తమను తాము కోల్పోకుండా ఉండే కమిట్మెంట్ మాత్రమే ఈ తరం కోరుకుంటున్నారు. అయినా మనం ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఎంచుకున్నామని అనుకోవడమే ఇప్పటి జనరేషన్ డెఫినిషన్‌లో మోస్ట్ హెల్దీ అండ్ మెచ్యూర్ లవ్.
What Women Want In A Man : మీలో ఈ లక్షణాలున్నాయా? అయితే మిమ్మల్ని ఏ అమ్మాయి కూడా వదులుకోదు..





