Just InternationalJust TechnologyLatest News

Elon Musk : గ్రోక్ ఏఐ భారం మోయలేకపోతున్నాం..ఎలాన్ మస్క్ కామెంట్లు దేనికి సంకేతం?

Elon Musk : గ్రోక్ ఏఐ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్ ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ కోసం కంపెనీలు చేస్తున్న భారీ అప్పులు అందరినీ టెన్షన్ పెడుతున్నాయి.

Elon Musk

రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీనే ప్రపంచాన్ని ఏలుతుందని, దానికి తగ్గట్లే పనుల వేగాన్ని పెంచి కంపెనీ భారాన్ని తగ్గించుకోవాలని ఆశపడిన బడా టెక్ కంపెనీకి ఇప్పుడు ఊహించని షాక్ తగులుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న మెయింటెనెన్స్ ఖర్చులు ఆయా కంపెనీల జేబులకు పెద్ద కన్నమే పెడుతున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఎక్స్ అధినేత ఎలన్ మస్క్(Elon Musk) కూడా తాను సొంతంగా డెవలప్ చేసిన గ్రోక్ ఏఐని నడపడం భారంగా మారిందని బహిరంగంగానే ఒప్పుకున్నారు. గ్రోక్ ఏఐ చాట్‌బాట్ ద్వారా వస్తున్న ఇన్కమ్ కంటే, దాన్ని కంటిన్యూగా రన్ చేయడానికి కావలసిన డేటా సెంటర్లు, సర్వర్ల బిల్లులే తడిసి మోపెడవుతున్నాయని మస్క్(Elon Musk) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పెరిగే ఖర్చులను కంట్రోల్ చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో గ్రోక్ ఏఐ వాడకంపై కొన్ని స్ట్రిక్ట్ రూల్స్, కంట్రోల్స్ విధించినట్లు ఆయన స్పష్టం చేశారు.

అయితే ఇది కేవలం ఎలన్ మస్క్ ఒక్కరి ప్రాబ్లెమ్ మాత్రమే కాదు. వరల్డ్ వైడ్‌గా ఏఐ రేసులో వెనకబడిపోకూడదని ఒకరితో మరొకరు పోటీపడుతున్న అమెరికన్ టెక్ దిగ్గజాల సిచ్యువేషన్ కూడా ఇలాగే తయారైంది. ఈ కొత్త టెక్నాలజీని ఓన్ చేసుకునేటపుడు ఆ కంపెనీలు చేస్తున్న అప్పులు ఇప్పుడు కొండలా పేరుకుపోతున్నాయి. ఏఐ హార్డ్‌వేర్, ప్రాసెసింగ్ చిప్‌లు, సూపర్‌ కంప్యూటర్ల కోసం ప్రతి నెలా వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఎస్‌బీఐ రీసెర్చ్ సర్వే రిలీజ్ చేసిన వివరాల ప్రకారం చూస్తే 2026 మధ్య నాటికి ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, ఆపిల్, మెటా (ఫేస్‌బుక్), మైక్రోసాఫ్ట్, ఎన్ వీడియా, టెస్లా వంటి టాప్ కంపెనీల మొత్తం అప్పుల భారం ఏకంగా 578 బిలియన్ డాలర్లకు చేరిపోయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం విలువ సుమారు 48 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే ఉంది!

ఒకవైపు మార్కెట్లో ఏఐ చాట్‌బాట్లకు విపరీతమైన క్రేజ్ కనిపిస్తున్నా కూడా.. ఇంకోవైపు వీటి వల్ల వచ్చే ఇన్కమ్ కంటే పెట్టే పెట్టుబడి, పవర్ బిల్లులు, సర్వర్ రెంట్స్‌ ఎక్కువగా ఉండటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ ఖర్చులు ఇలాగే పెరుగుతూ ఉంటే, బడా టెక్ కంపెనీల ఫ్యూచర్, ఆర్థిక స్థిరత్వం ఏ మలుపు తిరుగుతుందోనన్న టెన్షన్ టెక్ వర్గాల్లో స్టార్ట్ అయింది.

Gen Z Love Rules : నువ్వు లేకపోతే నేను లేను సీన్స్ బంద్..జెన్ జెడ్ సరికొత్త లవ్ రూల్స్ ఇవే..

Related Articles

Back to top button