Badvel Muncipal Elections : బోణీ కొట్టిన టీడీపీ.. బద్వేలులో ఘనవిజయం
Badvel Muncipal Elections : ఏపీలో ప్రస్తుతం మున్సిపల్ కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బద్వేలు 39వ వార్డులో టీడీపీ అభ్యర్థి విజయ గెలుపొందారు.
Badvel Muncipal Elections
ఏపీలో సంచలనం రేపిన స్థానిక సంస్థల పురపాలక ఎలక్షన్ రిజల్ట్ కౌంటింగ్ ఘట్టం ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన ఉత్కంఠ నెలకొని ఉండగా బరిలో నిలిచిన ప్రధాన పార్టీల కేండిడేట్స్ ఫ్యూచర్ ప్రస్తుతం ఓట్ల లెక్కింపు టేబుళ్లపై తేలుతోంది.
అయితే ఏపీలో విస్తారంగా కురుస్తున్న తుపాన్ వర్షాల ఎఫెక్ట్ ఈ కౌంటింగ్ పైన కూడా పడింది. వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రం ఈ కౌంటింగ్‌ను స్వల్పంగా ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు ఎన్నికల అధికారులు అఫీషియల్‌గా వెల్లడించారు. ఇక వర్ష ప్రభావం లేని మిగతా అన్ని కేంద్రాల్లో ముందుగా నిర్ణయించిన సమయానికే బ్యాలెట్ పెట్టెలను ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు.
ఓట్ల లెక్కింపు మొదలైన కాసేపటికే తొలి ఫలితం వెలువడి టీడీపీ ఎకౌంట్ తెరిచింది. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ(Badvel Muncipal Elections పరిధిలోని 39వ వార్డు ఓట్ల కౌంటింగ్ పూర్తి కాగా, అక్కడ టీడీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి తుడిమెళ్ల విజయ తన వైసీపీ కేండిడేట్‌పై ఏకంగా 372 ఓట్ల స్పష్టమైన మెజార్టీతో ఘనవిజయాన్ని సాధించారు. తొలి ఫలితమే తమ అకౌంట్‌లో పడటంతో టీడీపీ వర్గాలలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
Gen Z Love Rules : నువ్వు లేకపోతే నేను లేను సీన్స్ బంద్..జెన్ జెడ్ సరికొత్త లవ్ రూల్స్ ఇవే..





