Just LifestyleLatest News

Relationship Needs : అవసరాల చుట్టూ తిరిగే మనుషులు.. ఈ ప్రవర్తన వెనుక ఉన్న సైకాలజీ సీక్రెట్

Relationship Needs : మనుషుల సంబంధాలన్నీ అవసరాల చుట్టూనే ఎందుకు తిరుగుతాయి? మానవ ప్రవర్తన, స్వార్థం, మైండ్ సైకాలజీకి సంబంధం ఏంటి?

Relationship Needs

మన లైఫ్‌లో చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. కొంతమంది ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతో దగ్గరగా మెలుగుతారు. అయితే చాలా సంబంధాలు అవసరం(Relationship Needs) అనే దారం చుట్టూనే అల్లబడి ఉంటాయనేది చాలా సందర్బాలలో చూస్తుంటాం. అవసరం ఉన్నంతవరకు నిమిషానికి ఓసారి ఫోన్ చేసేవారు కాస్తా.. వారి పని అయిపోగానే మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలా ప్రవర్తించడం వెనుకున్న సైకాలజీ ఏంటో నిపుణులు వివరిస్తున్నారు.

సైకాలజీలో సోషల్ ఎక్స్ఛేంజ్ థియరీ అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం.. మనుషులు చేసే ప్రతి పని లేదా ఏర్పరచుకునే ప్రతి రిలేషన్ వెనుక ఎంతో కొంత లాభనష్టాల లెక్క ఉంటుంది. ఇది కేవలం డబ్బు లేదా ఫిజికల్ హెల్ప్ మాత్రమే కానక్కర్లేదు. ఎమోషనల్ సపోర్ట్, సొసైటీలో గుర్తింపు, ఒంటరితనం పోగొట్టుకోవడం , కాన్ఫిడెన్స్ పెంచుకోవడం వంటివి కూడా అవసరాల కిందకే వస్తాయి. ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తి ద్వారా ఏదో ఒక రూపంలో యూజ్ ఉందనుకున్నంత కాలం ఆ సంబంధం ఎంతో మధురంగానే కొనసాగుతుంది.

అంతేకాదు మనుషులు ఇలా ప్రవర్తించడం వెనుక మరో రీజన్ కూడా ఉంది. మనుషుల బ్రెయిన్ ఎప్పుడూ ఎమోషనల్ రివార్డ్ కోసం వెతుకుతుంటుంది. ఒకరితో మాట్లాడటం వల్ల ఎదుటివారికి ప్రశాంతత దొరికినా, లేదా వారి ప్రాబ్లెమ్‌కు పరిష్కారం లభించినా వారిని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే, ఎప్పుడైతే ఆ అవసరం తీరిపోతుందో, లేదంటే వారికంటే ఎక్కువ ప్రయోజనం ఇచ్చే వేరొకరు దొరుకుతారో.. అప్పుడు వారి బిహేవియర్‌లో చేంజ్ మొదలవుతుంది. దీనిని సైకాలజిస్టులు పర్పస్ బేస్డ్ ఎటాచ్‌మెంట్ అంటారు.

అయితే, ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా స్వార్థపరులని చెప్పలేం. కానీ, ఎక్కువ శాతం మానవ సంబంధాలన్నీ అవసరాలతోనే (Relationship Needs) మొదలవుతాయనేది మాత్రం నూటికి నూరు శాతం నిజం. కాబట్టి, ఎవరైనా మనతో అవసరం కోసమే మాట్లాడుతున్నారని తెలిసినప్పుడు బాధపడటం కంటే.. అది హ్యూమన్ నేచర్‌లో ఒక పార్ట్‌ అని అర్థం చేసుకోవడమే మంచిది. మన ఇంపార్టెన్స్‌ను గుర్తిస్తూ, స్వార్థం లేని స్వచ్ఛమైన రిలేషన్స్‌కు మాత్రమే ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల మెంటల్ పీస్ లభిస్తుందన్న విషయాన్ని ఎప్పుడూ ఫాలో అవ్వాలి.

Gen Z Love Rules : నువ్వు లేకపోతే నేను లేను సీన్స్ బంద్..జెన్ జెడ్ సరికొత్త లవ్ రూల్స్ ఇవే..

Related Articles

Back to top button