Just BusinessLatest News

Gold and silver : 2 రోజులుగా బంగారం, వెండి ధరల దూకుడు..ఈరోజు రేటెంత?

Gold and silver ధంతేరస్, దీపావళి పండుగల సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడితో పాటు కేజీ వెండి ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Gold and silver

ధంతేరస్, దీపావళి పండుగల సమయంలో గోల్డ్ కొనాలనుకునే పసిడి ప్రియులకు బులియన్ మార్కెట్ షాకిస్తోంది. సోమవారం నుంచి పుత్తడి ధరలు ఊహించని రీతిలో కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి. సాధారణంగా ధంతేరస్, దీపావళి సమయంలో బంగారం లేదా వెండి(Gold and silver) ఆభరణాలను, కాసులను కొంటే మంచి జరుగుతుందనే నమ్మకం చాలామందిలో బలంగా ఉంటుంది.

ఈ నమ్మకానికి తోడు ఈ వన్ వీక్ పండుగ సీజన్ కావడంతో మార్కెట్‌లో డిమాండ్ ఆటోమేటిక్‌గానే పెరిగింది. ఈ పెరిగిన డిమాండే బంగారం,వెండి రేట్లు పరుగులు పెట్టడానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పండుగ ముగిసే వరకు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశీయ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రేటు రూ. 1లక్ష42వేల810 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1లక్ష30వేల910గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఓపెన్ మార్కెట్లలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1లక్ష42వేల810 కాగా, 22 క్యారెట్ల రేటు రూ. 1లక్ష30వేల910 వద్ద నమోదైంది.

Gold and silver
Gold and silver

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1లక్ష42వేల960 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష31వేల60గా ట్రేడవుతోంది. ఇక చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1లక్ష42వేల810 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష30వేల910 వద్దే కొనసాగుతోంది.

పసిడితో పాటు వెండి (Gold and silver) ధరలు కూడా అదే రేంజ్‌లో పోటీ పడుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2లక్షల10వేల100 వద్ద ట్రేడవుతుండగా, నిన్నటితో పోలిస్తే రూ. 100 పెరిగింది. చెన్నై, బెంగళూరు, అలాగే ఢిల్లీ నగరాల్లో కూడా కేజీ వెండి ధర రూ. 2లక్షల10వేల100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
Dhanteras : ధనత్రయోదశి రోజు బంగారమే కొనక్కరలేదు..చీపురు, ఉప్పు, ధనియాలు కొన్నా సరిపోతుందట

Related Articles

Back to top button