Just EntertainmentLatest News

Ramayana : బాక్సాఫీస్ వద్ద రామాయణ మేనియా.. అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ..

Ramayana : రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన రామాయణం మూవీ రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ. 105 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది.

Ramayana

బాలీవుడ్ రణబీర్ కపూర్, సౌత్ క్వీన్ సాయి పల్లవి ,రాకింగ్ స్టార్ యష్ లీడ్ రోల్స్‌లో నటించిన మైథలాజికల్ వండర్ రామాయణం (Ramayana) మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. నవంబర్ 5న గురువారం రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుండగా, రిలీజ్‌కు కొద్ది గంటల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి నయా హిస్టరీని లిఖించింది.

దసరా పండుగకు కొద్ది రోజుల ముందే 15 రోజుల గ్యాప్ ఇచ్చి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించడం
ఈ చిత్రానికి అతిపెద్ద అడ్వాంటేజ్‌గా మారింది. స్టార్టింగ్‌లో కొంత నెమ్మదించినా, రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ క్రేజ్ బాగా పెరిగిపోయింది.

పంపిణీదారు ధర్మ ప్రొడక్షన్స్ ఆదాయ వాటా విషయంలో సింగిల్ స్క్రీన్ యజమానులతో జరిపిన చర్చల వల్ల ప్రారంభంలో ముంబై, ఢిల్లీ వంటి సిటీలలో కొద్ది స్క్రీన్లకే బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి.

అయితే శుక్రవారం రోజు ఈ థియేటర్ల డీల్ గొడవలు ముగిసిపోవడంతో, వీకెండ్‌కు ఊహించని రేంజ్‌లో స్క్రీన్లు పెరిగాయి. మంగళవారం ఉదయానికి ఏకంగా 5000 కు పైగా స్క్రీన్లు అందుబాటులోకి రాగా, దానిలో కేవలం చివరి 24 గంటల్లోనే 1500 కి పైగా కొత్త స్క్రీన్లు యాడవ్వడం ఈ సినిమాకి ఉన్న డిమాండ్‌ను చెప్పకనే చెబుతోంది.

లాస్ ఏంజిల్స్‌లో జరిగిన గ్రాండ్ ప్రీమియర్ తర్వాతే.. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ సేల్స్ వేగవంతమయ్యాయి. రిలీజ్‌కు రెండు రోజుల ముందు అంటే నవంబర్ 3 నాటికి భారతదేశంలోనే అడ్వాన్స్ అమ్మకాల ద్వారా రూ. 58 కోట్లు రాబట్టింది.

దీనిలో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ. 27 కోట్లు రాగా, రెండు , మూడో రోజుల షోల బుకింగ్స్ రూపంలో రూ. 25 కోట్లు ఎంటర్ అయ్యాయి. నాలుగో రోజైన ఆదివారం షోలకు కూడా గిరాకీ బాగానే ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 లక్షల టికెట్లు అమ్ముడవగా, కేవలం 4 శాతం స్క్రీన్లు మాత్రమే ఉన్న ఐమాక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లే ఈ రేంజ్‌లో కలెక్షన్లను రాబట్టడం విశేషం.

విదేశాల్లోనూ రామాయణం హవా బాగానే కొనసాగుతోంది. నవంబర్ 4వ తేదీన ఉత్తర అమెరికాలో ప్రివ్యూలు జరగనుండగా, ప్రపంచ ప్రీమియర్ జరిగిన ఒక్క రోజులోనే 27 శాతం వసూళ్లు పెరిగాయి. కేవలం అమెరికా ప్రీమియర్ల నుంచే 1.5 మిలియన్ డాలర్లు రాబట్టగా, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం 5 మిలియన్ డాలర్లకు చేరాయి.

దీంతో ప్రపంచవ్యాప్తంగా రామాయణం(Ramayana) సినిమా సాధించిన అడ్వాన్స్ వసూళ్లు రూ. 105 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు ఇండియన్ చిత్రసీమలో బాహుబలి 2, RRR, పుష్ప 2, ధురందర్ 2 వంటి కొన్ని మూవీలు మాత్రమే సాధించిన ఈ ఘనతను ఇప్పుడు రామాయణం సాధించింది. నవంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఆల్ టైమ్ టాప్-5 ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ మూవీల లిస్ట్‌లో నిలవడం పక్కా అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

Stubbornness : ఎన్నిసార్లు చెప్పినా కొందరు ఎందుకు మారరు? వారి మైండ్‌లో జరిగే సైకాలజీ ఏంటి?

Related Articles

Back to top button