Reward and Revenge: రివార్డ్ కోసం గ్రూప్ గేమ్.. రివెంజ్ దెబ్బకు బిగ్ బాస్ హౌస్‌లో లెక్కలు తారుమారు..
Reward and Revenge : బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో 9వ వారం రివార్డ్ అండ్ రివెంజ్ థీమ్ రంజుగా సాగుతోంది. ఫ్యామిలీ వీక్ ఆఫర్ కోసం కంటెస్టెంట్ల మధ్య జరిగిన వార్, శ్వేతకు దక్కిన రివార్డ్ , త్రిగుణ్‌ను టార్గెట్ చేసిన ఎపిసోడ్ హైలైట్స్ చూడండి.
Reward and Revenge
బిగ్ బాస్ హౌస్ అంటేనే ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయం తెలిసిందే. క్షణానికొక మలుపు, గంటగంటకూ మారుతున్న సమీకరణాలు గేమ్‌ను మరింత రంజుగా మారుస్తుంటాయి. ప్రస్తుతం హౌస్‌లో నడుస్తున్న 9వారం రివార్డ్ అండ్ రివెంజ్(Reward and Revenge) థీమ్ అయితే ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది.
టాస్కుల్లో గెలిస్తే ఫ్యామిలీ మెంబర్స్‌ను కలుసుకునే గోల్డెన్ ఛాన్స్, ఓడిపోతే మాత్రం ఏకంగా ఫ్యామిలీ వీక్‌ను కోల్పోయే డేంజర్ రివెంజ్..అందుకే ఈ రెండు అంశాలు కంటెస్టెంట్లలో టెన్షన్‌ను పీక్స్‌కు చేర్చేలా చేశాయి. ముఖ్యంగా పదో వారంలో రాబోయే ..ఫ్యామిలీ వీక్ సెంటిమెంట్ అస్త్రం కావడంతో, హౌస్మేట్స్ అంతా ఎలాగైనా ఈ వీక్ గేమ్‌లో గెలవాలని చాలా కష్టపడుతున్నారు.
ఇక ఈ వీకెండ్ వార్‌లో భాగంగా నడిచిన రివార్డ్ అండ్ రివెంజ్(Reward and Revenge) ఫస్ట్ టాస్క్‌లో సీన్ పూర్తిగా హీటెక్కిపోయింది. సంచాలకులుగా వ్యవహరించిన ముకేష్, త్రిగుణ్ సరిగ్గా డెసిషన్స్ తీసుకోలేకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. చివరకు దీనిపై బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేసరికి సీన్ సీరియస్ అయింది. ఆఖరికి త్రిగుణ్ టీం ఓటమిని ఒప్పుకోవడంతో, ముకేష్ టీమ్ ఈ గేమ్‌లో విన్నర్‌గా నిలిచింది. దీంతో గేమ్ కండీషన్ ప్రకారం ముకేష్ టీమ్‌కు రివార్డ్ దక్కగా, అవతలి టీమ్‌కు రివెంజ్ అస్త్రం తగిలింది.
రివార్డ్ ఎవరికి ఇవ్వాలనే చర్చ వచ్చినప్పుడు మాత్రం హౌస్‌లో ఫుల్ ఎమోషనల్ డ్రామా నడిచింది. మా అక్క ఎలా ఉందో తనకు తెలియాలంటూ ముకేష్ ఆవేదన వ్యక్తం చేయగా, నీతూ, వర్షిణి కూడా తమ కుటుంబాలను చాలా మిస్ అవుతున్నామని, తనకు ఆ రివార్డ్ కావాలని తమ మనసులోని మాట బయటపెట్టారు.
శివ్ కూడా తాను కూడా ఫ్యామిలీ కోసం చాలా తపిస్తున్నానని చెప్పడంతో..వెంటనే అమన్ మాత్రం అందరం ఎమోషనల్ అని చెప్పకండి అంటూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని సూచించాడు. దీంతో అందరూ కలిసి చివరకు ఏకాభిప్రాయంతో శ్వేతకు ఆ రివార్డ్‌ను కట్టబెట్టి ఫ్యామలీ వీక్‌కు అవకాశం ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు.
మరోవైపు రివెంజ్ విషయంలో ముకేష్ టీం అంతా కలిసి పక్కా ప్లాన్‌తో త్రిగుణ్‌ను టార్గెట్ చేసినట్లు కనిపించింది. ఈ మనిషికి రివెంజ్ అంటే ఏంటో తెలియాలంటూ శివ్ డైరెక్టుగా త్రిగుణ్ పేరే రాసేయడం గేమ్ ఎంత దూరం వెళ్లిందో చెప్పకనే చెబుతోంది. ఎందుకంటే ఒకసారి ఈ రివెంజ్ బారిన పడితే రాబోయే ఫ్యామిలీ వీక్‌లో తమ కుటుంబాన్ని కలుసుకునే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. దీంతో త్రిగుణ్ కోరిక ఈ గేమ్‌లో ప్రశ్నార్థకంగా మారింది. అతనొక్కడే కాదు మళ్లీ రివార్డ్ దక్కించుకునే ఛాన్స్ లేకపోవడంతో త్రిగుణ్ శిబిరం మొత్తం నిరాశలో ఉండిపోయారు.

ఈ హడావుడి ఇలా ఉంటే మరోవైపు ఈ వారం నామినేషన్ల నుంచి త్రిగుణ్, ఆర్కే, శ్వేత సేఫ్ జోన్లో ఉండటంతో కాస్త రిలాక్స్ అయ్యే ఛాన్స్ దక్కింది. మిగిలిన హౌస్మేట్స్ అంతా ఈ వీక్ నామినేషన్ల హీట్‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను బట్టి చూస్తే సుధీర్, వర్షిణి డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్‌ను వీడతారా? లేదంటే ఊహించని మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడా అన్న ఉత్కంఠకు తెరపడాలంటే మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో కింగ్ నాగార్జున వచ్చే వరకు వెయిట్ చేయాలి.
Winter Brain Stroke : 20 శాతం పెరిగిన బ్రెయిన్ స్ట్రోక్ కేసులు. వింటర్ సీజన్ సైలెంట్ అటాక్‌కు ఇలా చెక్ పెట్టండి..





