AI Mode : క్రోమ్‌లో ఏఐ మోడ్ షార్ట్‌కట్ కనిపించట్లేదా? గూగుల్ ఈ ఫీచర్ తొలగిస్తుందా?
AI Mode: గూగుల్ సెర్చ్ పేజీ నుంచి ఏఐ మోడ్( AI Mode) బటన్ మాయమవడంపై మొదలైన చర్చ. క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ నిర్వహిస్తున్న ఈ తాజా A/B టెస్టింగ్ , AI ఫీచర్ వివరాలు ఇక్కడ చూడండి.
AI Mode
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ పేజీ ఇంటర్ఫేస్లో మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. సెర్చ్ బార్లో కనిపించే ప్రత్యేకమైన ఏఐ మోడ్ (AI Mode) షార్ట్‌కట్ బటన్‌ను కొంతమంది వినియోగదారులకు టెంపరరీగా తొలగించినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా డెస్క్‌టాప్ క్రోమ్ బ్రౌజర్లో ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉపయోగిస్తున్నప్పుడు ఈ చేంజ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని టెక్ విశ్లేషకులు గుర్తించారు.
ఈ వినూత్న మార్పును టెక్ పరిశీలకులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. క్రోమ్‌లోని సెర్చ్ బార్ నుంచి అజ్ఞాత మోడ్‌తో పాటు ఏఐ మోడ్ ఐకాన్లు కనిపించడం లేదని వారు స్పష్టం చేశారు. అయితే, ఇది సర్వర్ సైడ్ నుంచి జరుగుతున్న ఒక లిమిటెడ్ ఎక్స్పెరిమెంట్ (A/B Testing) అని నిపుణులు భావిస్తున్నారు.

వేర్వేరు కంప్యూటర్లలో కానీ ఇతర ప్రొఫైల్స్ నుంచి కానీ లాగిన్ అయినప్పుడు మాత్రం ఈ ఐకాన్ ఎప్పటిలాగే కనిపిస్తుండడమే దీనికి ఉదాహరణ. సెర్చ్ బార్లో డైరెక్టుగా బటన్ లేనప్పుడు యూజర్స్ ఏఐ మోడ్‌ను ఎంత వరకూ వాడతారో తెలుసుకోవడమే ఈ రీసెర్చ్ వెనుక ప్రధాన ఉద్దేశం కావొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిజానికి గూగుల్ ఏఐ మోడ్ (AI Mode )అనేది యూజర్లు అడిగే సుదీర్ఘమైన ప్రశ్నలకు వివిధ వెబ్సైట్ల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి సంభాషణ రూపంలో సమాధానాలు అందించే ప్రత్యేక వ్యవస్థ. దీనిని గూగుల్ గ్లోబల్ వైడ్‌గా పరిచయం చేశాక, తర్వాత వాయిస్, విజువల్ సెర్చ్ వంటి కొత్త ఫీచర్లను కూడా దీనికి లింక్ చేసింది.
ప్రస్తుతం సెర్చ్ బార్లో ఈ బటన్ కనిపించనంత మాత్రాన ఫీచర్‌ను పర్మినెంట్‌గా తొలగించినట్లు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డిజైన్ పరంగా మరింత ఈజీగా మార్చడానికి గూగుల్ ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంటుందని అంటున్నారు. యూజర్స్ నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ బటన్‌ను మళ్లీ పునరుద్ధరించాలా లేదంటే వేరే స్థానంలో అమర్చాలా అనేది గూగుల్ త్వరలోనే క్లియర్ చేయనుంది.





