Just LifestyleHealthLatest News

Naphthalene Balls : వార్డ్‌రోబ్‌లో నాఫ్తలీన్ బాల్స్‌ వేస్తున్నారా?..వాటితో ఆరోగ్యమా? అనారోగ్యమా?

Naphthalene Balls : బట్టలను పురుగుల నుంచి కాపాడటానికి వాడే నాఫ్తలీన్ బాల్స్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదాలున్నాయా ? ముఖ్యంగా పిల్లలపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది?

Naphthalene Balls

బీరువాలో, అల్మారాలో బట్టలు స్మెల్ రాకుండా అలాగే చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండటానికి చాలామంది బట్టల మధ్యన నాఫ్తలీన్ బాల్స్ వేస్తుంటారు. ఘాటైన వాసన ఉండటంతో శీతాకాలపు బట్టలను భద్రపరచాలన్నా, ఖరీదైన పాత బట్టలను కాపాడుకోవాలన్నా ఇవి ఉండాల్సిందేనని చాలామంది నమ్ముతారు. అయితే ఈ చిన్న తెల్ల ఉండలు మన ఇళ్లలో ఏళ్ల తరబడి చేస్తున్న మాయాజాలం ఏంటో తెలిస్తే వీటిని అమాంతం బయట పడేస్తారని నిపుణులు అంటున్నారు.

చూడటానికి చిన్నగా, తెల్లగా కనిపించినా కూడా ఇవి ఆరోగ్యానికి ఎంత ముప్పో చాలా మందికి అసలు తెలియదు. నాఫ్తలీన్ బాల్స్ (Naphthalene Balls)నుంచి ఎప్పుడూ వెలువడే ఘాటైన రసాయన వాసన గాలిలో కలిసి మనం పీల్చినప్పుడు అది డైరెక్టుగా శ్వాసకోశ వ్యవస్థపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. తరచూ ఈ వాసనను పీల్చడం వల్ల తీవ్రమైన తలనొప్పి, కళ్లలో మంట, వికారం, వాంతులు వంటి సమస్యలు తెలీకుండానే చుట్టుముడతాయి.

ఇక చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్న ఇంట్లో వీటిని ఉంచితే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అజాగ్రత్తగా ఉండి ఒకవేళ పిల్లలు నాఫ్తలిన్ బాల్స్‌(Naphthalene Balls)ను నోట్లో పెట్టుకుంటే ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాఫ్తలీన్ ఉండల్లో ఉండే డేంజరస్ కెమికల్స్ చిన్నపిల్లలలో రక్తంలోని ఎర్ర రక్త కణాలను నాశనం చేసే ప్రమాదం ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

అంతేకాకుండా ఈ బాల్స్ వేసిన బట్టలను డైరెక్టుగా వేసుకుంటే చర్మవ్యాధులు, అలెర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది. కెమికల్స్ ఎఫెక్ట్ దుస్తులపై ఉండిపోయి, వాటిని ధరించడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తొచ్చు.

అందుకే ఇప్పటికైనా వాటిని వాడకుండా ఉండటం మంచిది. కెమికల్స్ నిండిన ఈ తెల్ల నాఫ్తలిన్ బాల్స్‌కు బదులుగా నేచురల్ పద్ధతులను వాడటం ఎప్పుడూ సురక్షితం.ఎండిన వేపాకులు, లవంగాలు, కర్పూరం లేదా లావెండర్ సువాసన పౌచ్‌లను అల్మారాల్లో ఉంచడం వల్ల బట్టలు పాడవకుండా చక్కగా కాపాడుకోవచ్చు.

Ranabaali : నెట్‌ఫ్లిక్స్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక రణబాలి..ఓటీటీలో రణబాలి స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

Related Articles

Back to top button