Just EntertainmentLatest News

Ranabaali : నెట్‌ఫ్లిక్స్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక రణబాలి..ఓటీటీలో రణబాలి స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

Ranabaali : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన రణబాలి సినిమా ఈ నెలలోనే ఓటీటీలో రానుంది. రణబాలి ఏ డేట్ నుంచి స్ట్రీమింగ్ కానుందో చూద్దాం..

Ranabaali

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబోలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి(Ranabaali) బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఎంతో వేగంగా ఓటీటీ బాట పట్టింది.

థియేటర్లలో రిలీజ్‌ అయిన నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించింది. వచ్చే నవంబర్ 13వ తేదీ నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ప్రియులకు అందుబాటులో రానుంది.

కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ చేయనుంది. విజయ్, రష్మిక జంటకు ఆన్‌స్క్రీన్‌లో ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి తోడు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ కావడంతో అభిమానులు దీనిపై విపరీతమైన ఆసక్తిని చూపించారు.

బ్రిటీష్ వలస పాలన కాలం నాటి చారిత్రక బ్యాక్‌డ్రాప్‌తో 19వ శతాబ్దంలో విదేశీ పాలకులపై పోరాడిన ఒక వీరుడి రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటించడం సినిమాకు ప్లస్ అయింది. థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూడడానికి క్యూరియస్‌గా ఎదురుచూస్తున్నారు. మరి ఓటీటీలో రణబాలి(Ranabaali) మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

Buxa Tiger Reserve : సొరంగం తవ్వి పారిపోయిన ఆడపులి..4 రోజుల్లోనే బోల్తా కొట్టించిన ట్రిక్కీ టైగ్రెస్‌..

Related Articles

Back to top button