Just LifestyleLatest News

Mogging : ఏంటీ మాగింగ్..సెలబ్రిటీల నుంచి యూత్ వరకూ ఎందుకింత ఫేమస్ అయింది?

Mogging : కేవలం ఫిజికల్ అప్పీయరెన్స్‌కు మాత్రమే పరిమితం కాదు.. మెంటల్ డామినేషన్‌లో కూడా మాగింగ్ క్లియర్‌గా కనిపిస్తుంది.

Mogging

సెలబ్రిటీల నుంచి కాలేజ్ కుర్రాళ్ల వరకు అందరి నోటా ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక ట్రెండీ మాట.. మాగింగ్. ఈ మాగింగ్(Mogging) అంటే కేవలం లుక్స్ పరంగా ఎవరినైనా డామినేట్ చేయడం మాత్రమే కాదని.. దాని వెనుక బ్రెయిన్ పనిచేసే తీరు, సైకాలజీకి సంబంధించిన చాలా పెద్ద విషయమే దాగి ఉందని నిపుణులు అంటున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఫోటోలు చూస్తున్నప్పుడు ఎవరైనా మనకంటే బాగా కనిపిస్తే.. మనలో కలిగే ఆ ఇన్‌ఫిరియారిటీ ఫీలింగ్ లేదంటే వారి కంటే మనం బెటర్ అనిపించుకోవాలనే తపన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలంటే మాత్రం దీని వెనుకున్న బిహేవియరల్ సైకాలజీని పూర్తిగా అర్థం చేసుకోవాలి.

ఎవల్యూషనరీ సైకాలజీ ప్రకారం ఇలాంటి మనుషుల్లో పుట్టుకతోనే ఒక డామినేటింగ్ ట్రెండ్, అందరిలో తామే టాప్‌లో ఉండాలనే కోరిక ఉంటాయి. ప్రాచీన కాలంలో ట్రైబల్ సొసైటీలో ఎవరు స్ట్రాంగ్‌గా, అట్రాక్షన్‌గా ఉంటే వాళ్లదే పైచేయి అయ్యేది. అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఈ మోడర్న్ డిజిటల్ యుగంలో మాగింగ్(Mogging) రూపంలో మరీ బయటకొచ్చింది. ఒక వ్యక్తి పక్కన మనం నిలబడినప్పుడు మన ఫిజిక్, స్టైల్, లేదా కాన్ఫిడెన్స్‌తో వాళ్లను సైలెంట్‌గా తక్కువ చేసి చూపించడమే ఈ మాగింగ్ సైకాలజీ అన్నమాట. అయితే ఇది కేవలం ఫిజికల్ అప్పీయరెన్స్‌కు మాత్రమే పరిమితం కాదు.. మెంటల్ డామినేషన్‌లో కూడా ఇది క్లియర్‌గా కనిపిస్తుంది.

సోషల్ కంపారిజన్ థియరీ ప్రకారం చూస్తే.. మనుషులు తమ వ్యాల్యూని ఎప్పుడూ ఇతరులతో కంపేర్ చేసుకోవడం ద్వారానే అంచనా వేసుకుంటూ ఉంటారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్ పుణ్యమా అని ఈ పోల్చుకోవడం అనేది ఇప్పుడు పీక్స్‌కి వెళ్లిపోయింది. ప్రతీ ఒక్కరూ పక్కవాడిని ఎలా ఓడించాలి.. లుక్స్ పరంగా ఎలా హైలో ఉండాలనే రేసులో పరుగెడుతున్నారు. ఎవరైనా మనకంటే బాగా కనిపిస్తే బ్రెయిన్ వెంటనే అలర్ట్ అయ్యి ఇన్సెక్యూరిటీ ఫీల్‌ను క్రియేట్ చేస్తుంది. అందుకే జెన్ జీ తరం ఈ టెన్షన్‌ను తట్టుకోలేక, దాన్ని ఒక ఫన్నీ స్లాంగ్‌గా, సెల్ఫ్ డిప్రెకేటింగ్ హ్యూమర్‌గా మార్చుకుని మాగింగ్ అనే వర్డ్‌గా ట్రెండ్ చేశారు.

అయితే దీనిలో ఉన్న డార్క్ సైడ్ ఏంటంటే.. ఎప్పుడూ ఎవరో ఒకరితో పోల్చుకుంటూ అవతలివారిని డామినేట్ చేయాలని చూసే ఈ మైండ్‌సెట్ వల్ల మెంటల్ పీస్ పూర్తిగా దెబ్బతింటుంది. బాడీ షేమింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్, బ్యూటీ ఒక్కటే లైఫ్ అనే భ్రమ ఇవన్నీ మనుషులను డిప్రెషన్ వైపు లాక్కెళ్తున్నాయి. అందుకే మాగింగ్ అనేది పైకి ఫన్నీగా చెప్పుకునే ట్రెండ్‌లా కనిపించినా.. దాని వెనుక ఉన్న సైకలాజికల్ ప్రెషర్ మాత్రం చాలా మందిని లోపల నుంచి వీక్ చేసేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతరులతో పోటీ పడటం కంటే మన మెంటల్ పీస్‌ని కాపాడుకోవడమే అసలైన విజయమని గ్రహిస్తే ఈ ట్రెండ్స్ టెన్షన్ నుంచి ఈజీగా బయటపడొచ్చు.

Ranabaali : నెట్‌ఫ్లిక్స్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక రణబాలి..ఓటీటీలో రణబాలి స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

Related Articles

Back to top button