Just TelanganaJust PoliticalLatest News

Parental Support : పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతాల్లో కోత..వృద్ధుల సంక్షేమం కోసం వస్తున్న కొత్త చట్టం

Parental Support : వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్‌ను పట్టించుకోని గవర్నమెంట్ ఉద్యోగుల శాలరీ నుంచి ప్రతి నెలా కొంత మొత్తం కట్ చేసే తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ చట్టం-2026 అమలు నిబంధనల వివరాలు చూద్దాం.

Parental Support

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులపై నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమైంది. వారి శాలరీ నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి డైరెక్టుగా తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేసే తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ చట్టం-2026ను అమలు చేయడానికి వయోవృద్ధుల సంక్షేమ శాఖ తాజాగా నియమ నిబంధనలు రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపింది.

కష్టపడి పెంచి పెద్ద చేసిన పేరెంట్స్‌ను(Parental Support) ఒక ఏజ్ వచ్చాక భారంగా భావించి అనాథలుగా వదిలేసే సంస్కృతికి అడ్డుకట్ట వేయడమే రేవంత్ సర్కార్ ఈ చట్టాన్ని తీసుకురావడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన గవర్నమెంట్ ఉద్యోగులే కన్నవారిని పట్టించుకోకపోతే.. వారికి సోషల్ రెస్పాన్ నేర్పడంతో పాటు వయోవృద్ధులకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, జీవించే హక్కు, ఆత్మగౌరవాన్ని కల్పించడమే ఈ చట్టం యొక్క పరమార్థం.

గవర్నమెంట్ ఉద్యోగులైన కుమారులు లేదా కుమార్తెలు వారు దత్తత తీసుకున్నవారైనా సరే తమను సరిగ్గా చూసుకోవడం లేదని భావిస్తే, బాధిత పేరెంట్స్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక అథారిటీకి ఆన్‌లైన్ లేదా డైరెక్టుగా తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.

వారి దరఖాస్తును పరిశీలించిన పది రోజుల్లో సంబంధిత ఉద్యోగికి అధికారులు నోటీసులు పంపిస్తారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలినా లేదంటే ఉద్యోగి హాజరుకాకపోయినా, ఉద్యోగి నెలకు పొందే మొత్తం శాలరీలో 15 శాతం కానీ రూ.10 వేలు కానీ ..ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రతి నెలా తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని అథారిటీ స్పీకింగ్ ఆర్డర్స్ జారీ చేస్తుంది.

ఒకవేళ వారి ఫ్యామిలీలో ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్‌ ఉద్యోగులై ఉంటే, ఆ మొత్తాన్ని ఇద్దరూ 50:50 నిష్పత్తిలో ఈక్విల్‌గా భరించాల్సి ఉంటుంది. జిల్లా అథారిటీలకు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. ఈ ఆదేశాలను గవర్నమెంట్ 60 రోజుల్లోగా తప్పనిసరిగా అమలు చేయాల్సిందే.. లేకపోతే జరిమానా విధిస్తారు. ఒకవేళ అరవై రోజుల్లో కలెక్టర్ అథారిటీ కేసును పరిష్కరించకపోతే, బాధిత పేరెంట్స్ రాష్ట్ర కమిషన్‌లో అప్పీల్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం తెలంగాణలో ఈ కొత్త చట్టం కింద అప్పుడే హైదరాబాద్‌ నుంచి 3, కరీంనగర్, నిజామాబాద్‌ నుంచి ఒక్కోటి చొప్పున మొత్తం ఐదు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఈ చట్టం ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచడమే కాకుండా, వయోవృద్ధులకు ఆర్థిక(Parental Support) , మానసిక భరోసానిస్తుందని భావిస్తున్నారు.

Amla Tree : కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఎందుకు? ఈ ఆచారం వెనుక ఏముంది?

Related Articles

Back to top button