Just LifestyleLatest News

GYM Rules : జిమ్‌లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే.. జిమ్ లవర్స్ తెలుసుకోవాల్సిన డేంజర్ సైన్

GYM Rules : తక్కువ టైమ్‌లో కండలు పెంచాలనే పిచ్చితో జిమ్‌లో మితిమీరిన కసరత్తులు చేస్తే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

GYM Rules

బాడీ బిల్డింగ్, ఫిట్‌నెస్ అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చే డైలాగ్ నో పెయిన్ నో గెయిన్. నొప్పులు భరిస్తేనే రిజల్ట్ వస్తుందంటూ ఆ ఫార్ములానే ఫాలో అవుతారు. కానీ ఇదే సూత్రాన్ని గుడ్డిగా నమ్మి జిమ్‌లలో(GYM Rules) ఓవర్‌గా కసరత్తులు చేస్తే అది డైరెక్టుగా మన ప్రాణాల మీదికే తెస్తుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. రాత్రికి రాత్రే కండలు తిరిగిన బాడీ రావాలనే తొందరపాటుతో చేసే రాంగ్ ఎక్సర్‌సైజులు రాబ్డోమయోలిసిస్ అనే వెరీ డేంజరస్ సిచ్యువేషన్‌కు దారి తీస్తాయని స్పష్టం చేస్తున్నారు.

ఇటీవల జిమ్‌లో జాయిన్ అయిన ఒక 25 ఏళ్ల యువకుడు ఫస్ట్ రోజే ఏకంగా 90 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, భారీ పుష్ అప్స్ చేశాడు. కట్ చేస్తే..2 రోజుల తర్వాత తీవ్రమైన కండరాల నొప్పులు రావడమే కాకుండా యూరిన్ కలర్ కంప్లీట్‌గా థిక్ టీ డికాషన్ కలర్‌లోకి మారిపోవడంతో భయపడి ఎమర్జెన్సీలో చేరాడు.

అతనికి టెస్టులు చేసిన డాక్టర్లు షాక్ అయ్యారు. ఓవర్ ఎక్సర్‌సైజుల వల్ల కండరాలు విచ్ఛిన్నమై మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ అటాక్ చేయడంతో అతని కిడ్నీలు సగానికి పైగా బ్లాక్ అయిపోయాయి.వెంటనే డాక్టర్లు టైమ్‌కి స్పందించి స్పెషల్ ఫ్లూయిడ్స్ అందించడంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

అసలు ఈ రాబ్డోమయోలిసిస్ అంటే ఏంటంటే.. ఎవరైనా లిమిట్ దాటి వర్కవుట్స్ చేసినప్పుడు మన బాడీలోని మజిల్స్ సెల్స్ తట్టుకోలేక బ్రేకప్ అవుతాయి. వాటిలోని మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ డైరెక్టుగా బ్లడ్‌లో కలిసిపోయి కిడ్నీల్లోని సన్నటి నాళాలను కంప్లీట్‌గా జామ్ చేసేస్తుంది. దీనివల్ల కిడ్నీలు వర్క్ చేయడం ఆగిపోయి, పరిస్థితి విషమిస్తే వెంటనే డయాలసిస్ పెట్టాల్సిన సిచ్యువేషన్‌ వస్తుంది.

అందుకే వర్కవుట్ చేసేవారు కొన్ని సింప్టమ్స్‌ను అస్సలు లైట్ తీసుకోకూడదని . యూరిన్ కలర్ బ్లాకిష్ లేదా టీ కలర్‌లోకి మారడం, మజిల్స్ స్వెల్లింగ్, ఎక్స్‌ట్రీమ్ వీక్నెస్, పాస్ అయ్యే యూరిన్ పరిమాణం సడన్‌గా తగ్గిపోవడం, వాంతులు రావడం వంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలి.

అందుకే జిమ్‌కు వెళ్లే వాళ్లు ఎప్పుడైనా స్లోగా స్టార్ట్ చేయాలి. వర్కవుట్ మధ్యలో బాడీ హైడ్రేటెడ్‌గా ఉండటానికి నీళ్లు తాగుతూ ఉండాలి. మజిల్స్ రికవర్ అవ్వడానికి వీక్‌లో ఒక రోజు అయినా కచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ వర్కవుట్స్ చేయడం అస్సలు మంచిది కాదు. బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ మైండ్‌లో పెట్టుకుని వర్కవుట్ చేస్తే సేఫ్‌గా ఉంటారు

PAN Card Name Change : పాన్ కార్డులో పేరు తప్పుగా ఉందా? ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఇలా మార్చుకోండి

Related Articles

Back to top button