Just EntertainmentLatest News

Megaverse : వైరల్‌గా చిరంజీవీస్ మెగావర్స్ ప్రోమో.. నా అడ్డా అంటూ చిరు రచ్చ..

Megaverse : నెట్‌ఫ్లిక్స్ కోసం చిరు హోస్ట్ చేస్తున్న చిరంజీవీస్ మెగావర్స్ టాక్ షో ప్రోమో ఈరోజు రిలీజ్ అయి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

Megaverse

ఇప్పటివరకు సినిమాల ద్వారా కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక ఇంట్రస్టింగ్ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. చిరంజీవీస్ మెగావర్స్ పేరుతో రూపొందుతున్న ఈ షోకు సంబంధించిన ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయడంతో సినీ లవర్స్‌లో కొత్త జోష్ మొదలైంది.

ఈ ప్రోమోలో చిరంజీవి తనదైన స్టైల్‌లో పలికిన ఇది నా అడ్డా డైలాగ్ చిరు ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాలను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ డైలాగ్ డెలివరీ, ఆయనలోని స్పీడ్, చమత్కారం ఈ ప్రోమో ద్వారా మరోసారి బయటకు వచ్చాయి.

అంతేకాకుండా ఈ ప్రోమోలో మరో ఆసక్తికరమైన హింట్ ఉండటంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు . చిరంజీవి పేరులోని ‘N’ అక్షరం మిస్ అయి..అందులో నెట్‌ఫ్లిక్స్ సింబల్‌ను ఎండింగ్‌లో కనిపించడంతో ప్రోమో క్రియేటర్స్ క్రయేటివిటీకి ఫిదా అవుతున్నారు.

సాధారణంగా సినిమాలలో రోల్‌కు తగినట్లుగా డైలాగ్స్, అప్పుడప్పుడు సభావేదికలపై చిరు మాస్ డైలాగ్‌ డెలివరీతో అభిమానుల హార్ట్‌ను టచ్ చేసిన చిరు.. ఈ టాక్ షోలో చిరంజీవి మునుపెన్నడూ చూడని విధంగా సరదాగా, చమత్కారంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. హోస్ట్‌గా మెగాస్టార్ చేసే సందడి, గెస్టులతో పంచుకునే ఆసక్తికర విషయాలు ఈ షోకు మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి.

ఈ షో పరిధి కేవలం సినిమాలకు చెందిన సెలబ్రెటీలకే పరిమితం కాకపోవడం మరో ప్రత్యేకత. సినిమా, క్రీడలు, అలాగే పాపులర్ కల్చర్ రంగాలకు చెందిన అన్ని రకాల ప్రముఖులతో చిరంజీవి ముచ్చటించనున్నారు. విభిన్న రంగాల్లోని ప్రముఖులతో ఆయన చేసే మాటలు ఎలా ఉంటాయా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఒక్కో రంగం నుంచి వచ్చే సెలబ్రెటీల అనుభవాలు, వారి ఆలోచనలను మెగాస్టార్ తనదైన స్టైల్‌లో ఎలా రాబడతారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ షోలో గెస్టులుగా ఎవరు రాబోతున్నారన్న దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, బ్రహ్మానందం, సందీప్ రెడ్డి వంగా, రవితేజ, నాని, బాబీ కొల్లి వంటి స్టార్స్ అండ్ దర్శకులు ఈ షోలో పాల్గొననున్నట్లు సమాచారం. ఇంతమంది ఫేమస్ సెలబ్రెటీలు , క్రియేటర్లు ఈ షోలో కనిపిస్తే ఎపిసోడ్లు ఎంత రసవత్తరంగా ఉంటాయోనని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్ఎల్‌పీ సంస్థలు కంబైన్డ్‌గా ఈ షోను నిర్మిస్తున్నాయి. స్ట్రీమింగ్ వివరాలను చూస్తే, నవంబర్ 30వ తేదీ సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి చిరంజీవిస్ మెగావర్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. ఓటీటీ వేదికపై మెగాస్టార్ హోస్ట్‌గా చేస్తున్న ఈ కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ నుంచి ఎలాంటి ఆదరణ అందుకుంటుందో వేచి చూడాలి.

Gold Spot Cool Drink : 26 ఏళ్ల తర్వాత గోల్డ్ స్పాట్ రీ-ఎంట్రీ..రిలయన్స్ క్యాంపాకు చెక్ పెట్టడానికేనా?

Related Articles

Back to top button