Just LifestyleLatest News

Sleep Mask : రోజూ స్లీప్ మాస్క్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే స్కిన్ దెబ్బతింటుందట..

Sleep Mask : స్లీప్ మాస్క్‌లను డైలీ వాడటం వల్ల వచ్చే చర్మ సమస్యలు, అలర్జీలు, పిగ్మెంటేషన్ గురించి తెలుసుకోండి. తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలు ఇక్కడ చూడండి.

Sleep Mask

మార్నింగ్ అంతా బిజీబిజీ షెడ్యూల్‌తో అలసిపోయి.. రాత్రిపూట అయినా ప్రశాంతంగా నిద్రపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ గజిబిజి లైఫ్‌స్టైల్, వర్క్ టెన్షన్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం, రూమ్‌లో లైటింగ్ వంటి రకరకాల కారణాలతో చాలామందికి సరైన నిద్ర కరవవుతోంది. డార్క్‌నెస్ కోసం, మంచి నిద్ర పట్టడం కోసం చాలామంది స్లీప్ మాస్క్‌(Sleep Mask)లు వేసుకుని పడుకుంటున్నారు. వీటిని అప్పుడప్పుడు వాడితే పర్లేదు కానీ, కంటిన్యూగా వాడితే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్రలో అటు ఇటు దొర్లినప్పుడు మాస్క్ ఫేస్‌కు రాసుకుంటూ రాపిడికి గురవుతుంది. దీనివల్ల ఆ భాగంలో స్కిన్ రఫ్‌గా మారడం, మార్క్ పడటం, ఎర్రబడటం, దురద రావడం వంటివి జరుగుతుంది. ముఖ్యంగా సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో చేసిన మాస్క్‌లు వాడితే కళ్ల చుట్టూ గాలి ఆడక చెమట, ఆయిల్ పేరుకుపోయి చిన్న చిన్న పొక్కులు వచ్చే అవకాశం ఉంటుంది.

కొంతమందికి అలర్జీ కూడా రావొచ్చు. కళ్ల చుట్టూ చర్మం చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి, టైట్‌గా ఉండే మాస్క్‌లు వాడితే గాలి తగలక, రాపిడి వల్ల రంగు మారి హైపర్ పిగ్మెంటేషన్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక మార్కెట్లో ఆకర్షణీయంగా కనిపించడానికి వాడే ఆర్టిఫిషియల్ కలర్స్, సువాసన కోసం వాడే కెమికల్స్ వల్ల కళ్లకు, చుట్టుపక్కల స్కిన్‌కి ఇరిటేషన్ లేదా అలర్జీ రావొచ్చు.

మంచి నిద్ర కోసం మాస్క్ వాడాలనుకున్నవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. కళ్ల షేప్‌కు తగ్గట్టుగా కర్వ్డ్ డిజైన్‌లో ఉండే కాంటూర్డ్ మాస్క్‌లు వాడటం వల్ల కళ్లు, రెప్పలపై ప్రెజర్ పడదు, నిద్ర కూడా హాయిగా పడుతుంది. మెటీరియల్ విషయానికి వస్తే సింథటిక్ లేదా సిల్క్ వాడటం కంటే కాటన్ మాస్క్‌లు వాడితే బెటర్. ఇవి స్వెట్‌ను పీల్చుకుని గాలి ఆడేలా ఉంచుతాయి. దాంతో పొక్కులు, వైట్‌హెడ్స్, పిగ్మెంటేషన్ తగ్గుతాయి.

స్ట్రాప్ మరీ బిగుతుగా కాకుండా ఎలాస్టిక్ లేదంటే అడ్జస్ట్ చేసుకునేలా ఉండాలి. స్మెల్, కెమికల్స్ లేని ప్లైన్ మాస్క్‌లను ఎంచుకోవడం మంచిది. అలాగే నైట్ టైమ్ వాడిన ప్రతిసారి ఆ మాస్క్‌ను మర్నాడు క్లీన్ చేస్తూ ఉండాలి, లేదంటే దుమ్ము, ఆయిల్ పేరుకుపోయి స్కిన్ పాడవుతుంది.

రాత్రి పడుకునే ముందు నైట్ క్రీమ్, మాయిశ్చరైజర్ రాసుకునే అలవాటు ఉంటే టైట్ మాస్క్ పెట్టుకోకూడదు, దానివల్ల పోర్స్ మూసుకుపోయి వైట్‌హెడ్స్, పింపుల్స్, చిన్న చిన్న ఎలర్జీలు వంటివి వస్తాయి. కొంచెం లూజ్‌గా, గాలి తగిలేలా ఉంటే మంచిది. ఎగ్జిమా వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు , కంటికి సంబంధించిన సర్జరీలు చేయించుకున్న వాళ్లెవరైనా సరే తప్పనిసరిగా డాక్టర్‌ను అడిగిన తర్వాతే స్లీప్ మాస్క్(Sleep Mask) వాడాలి.

Sonia Gandhi : రాజీవ్ గాంధీ హత్య వెనుక పెద్ద కుట్ర? సోనియా గాంధీ బుక్‌తో మళ్లీ హీట్..

Related Articles

Back to top button