Just EntertainmentLatest News

OG: ఓజీలో కన్మణి వెనుక కథేంటి?

OG:ఓ వైపు హింసతో నిండిన గ్యాంగ్‌స్టర్ ప్రపంచం, మరో వైపు ప్రేమ, ప్రశాంతతను అందించే 'కన్మణి' పాత్ర.. ఈ రెండింటి కలయిక సినిమా కథనానికి ఒక కొత్త కోణాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.

OG

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ (OG). ‘సాహో’ ఫేం సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో కనిపించనుండగా, ఆయనకు జతగా హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక మోహన్ పాత్రను ఇటీవల చిత్ర బృందం పరిచయం చేసింది. తాజాగా ఈ (OG)మూవీలో తన పాత్ర పేరు ‘కన్మణి’ అని అనౌన్స్ చేయడంతో, చాలామందికి ఈ అమ్మాయి ఎవరు, ఈ పాత్ర వెనుక ఉన్న కథ ఏంటి అనే ఆసక్తి మొదలైంది.

ప్రియాంక మోహన్ తెలుగు ప్రేక్షకులకు ‘నాని’ సినిమా నానిస్ గ్యాంగ్ లీడర్ తో పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ‘శ్రీకారం’ సినిమాలో శర్వానంద్‌కు జంటగా కనిపించారు. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె ఎక్కువగా తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టారు.

శివకార్తికేయన్‌తో కలిసి నటించిన ‘డాక్టర్’ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో, ప్రియాంక మోహన్ తమిళంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ తర్వాత సూర్యతో కలిసి ‘ఈటీ’ (ET: Etharkkum Thunindhavan)లో, ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ లోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల నానితో ఆమె చేసిన మరో సినిమా ‘సరిపోదా శనివారం’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా తెలుగు, తమిళ భాషల్లో అడుగులు వేస్తూ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌తో సినిమా చేయడం ఆమె కెరీర్‌లోనే ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు.

‘ఓజీ’ అంటేనే ఒక గ్యాంగ్‌స్టర్ సినిమా. యాక్షన్, హింస, ఉద్వేగాలు ఎక్కువగా ఉండే ఈ కథలో, ప్రియాంక మోహన్ పాత్ర అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ “ప్రతి తుఫానుకు ఒక ప్రశాంతత అవసరం” (Every storm needs its calm) అని ఒక క్యాప్షన్ ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే, పవన్ కళ్యాణ్ పోషిస్తున్న యాక్షన్ రోల్‌కు ప్రియాంక మోహన్ ‘కన్మణి’ అనే పాత్ర ఎమోషనల్ సపోర్ట్‌గా ఉంటుందని స్పష్టమవుతుంది.

OG
OG

ఓ వైపు హింసతో నిండిన గ్యాంగ్‌స్టర్ ప్రపంచం, మరో వైపు ప్రేమ, ప్రశాంతతను అందించే ‘కన్మణి’ పాత్ర.. ఈ రెండింటి కలయిక సినిమా కథనానికి ఒక కొత్త కోణాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ప్రియాంక మోహన్ పాత్రను రెండు విభిన్నమైన లుక్స్‌లో పరిచయం చేయడంలో కూడా అదే ఉద్దేశం కనిపిస్తోంది. ఒక పోస్టర్‌లో ఆమె సాంప్రదాయ దుస్తుల్లో ప్రశాంతంగా కనిపిస్తే, మరొక పోస్టర్‌లో ఆమె పాత్రలోని సున్నితమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ పక్కన, ‘కన్మణి’ అనే పేరుతో ప్రియాంక మోహన్ తన నటనతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.’

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button