Just InternationalLatest News

James Webb:విశ్వం పుట్టుక ఎలా జరిగింది? జేమ్స్ వెబ్ చెబుతున్న నిజాలు!

James Webb: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను ఉపయోగించి పనిచేస్తుంది. ఈ కిరణాలు దుమ్ము, గ్యాస్ మేఘాల గుండా ప్రయాణించగలవు.

James Webb

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) అనేది నాసా, యూరోపియన్ మరియు కెనడియన్ అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఒక అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్. దీనిని అంతరిక్షంలో భూమికి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో, లాగ్రాంజ్ పాయింట్ 2 వద్ద ప్రతిష్టించారు. ఇది హబుల్ టెలిస్కోప్ కంటే లక్షల రెట్లు శక్తివంతమైనది.

జేమ్స్ వెబ్(James Webb) టెలిస్కోప్ ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను ఉపయోగించి పనిచేస్తుంది. ఈ కిరణాలు దుమ్ము, గ్యాస్ మేఘాల గుండా ప్రయాణించగలవు, దీనివల్ల ఇది చాలా దూరంలో ఉన్న, మరియు విశ్వం ప్రారంభమైన తొలి గెలాక్సీలను కూడా చూడగలదు.

James Webb
James Webb

ఈ టెలిస్కోప్ ఇప్పటికే విశ్వం గురించి అనేక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు చేసింది. ఇది మనకు విశ్వం ప్రారంభమైన తొలి గెలాక్సీల చిత్రాలను పంపింది. వీటిని చూడటం వల్ల బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం ఎలా రూపాంతరం చెందిందో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఉదాహరణకు, ఇది స్టీఫెన్స్ క్వింటెట్ వంటి గెలాక్సీల సమూహాలను చాలా స్పష్టంగా చిత్రీకరించింది.

అలాగే, ఇది అనేక ఎగ్జోప్లానెట్స్‌ అంటే సూర్యుడి వ్యవస్థ బయట ఉన్న గ్రహాల యొక్క వాతావరణాలను అధ్యయనం చేసి, అక్కడ జీవం ఉనికి గురించి సూచనలను అందిస్తోంది. ఉదాహరణకు, WASP-96 b అనే ఎగ్జోప్లానెట్ వాతావరణంలో నీటి జాడలను గుర్తించింది.

జేమ్స్ వెబ్ (James Webb)టెలిస్కోప్ విశ్వం పుట్టుక, నక్షత్రాలు , గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి, మనకు తెలిసిన జీవం లాంటిది ఇంకెక్కడైనా ఉందా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతోంది.

Black holes: విశ్వ చరిత్రను మార్చే సంఘటన.. బ్లాక్ హోల్స్ అంతం అవుతాయా?

Related Articles

Back to top button