Just EntertainmentLatest News

OG మూవీ బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్…టికెట్ ధరలు ఎంతంటే.. ?

OG: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "OG" విడుదలకు సమయం దగ్గర పడింది. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ పెద్ద పండగే. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ పొలిటికల్ గా బిజీ అయిపోయారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే పవన్ నటించిన హరిహరవీరమల్లు విడుదలై అభిమానులను నిరాశపరిచింది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా “OG” మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “OG” విడుదలకు సమయం దగ్గర పడింది. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సమయంలో పవన్ ఫ్యాన్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. “OG” మూవీ బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది. అలాగే టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

OG
OG

“ఒరిజినల్ గ్యాంగ్ స్టర్” మూవీ బెనిఫిట్ షోల విషయంలో కొన్ని నిబంధనలు విధించింది. ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లకు సెప్టెంబర్ 25 అర్థరాత్రి 1.00 గంటకు ఒక బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది. అలాగే బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1000 గా నిర్ణయించింది. అదే సమయంలో ఒకరోజు ఐదు షోలు మించకూడదనే నిబంధన కూడా విధించారు.

Babycorn :బేబీకార్న్.. ఆరోగ్యానికి కొత్త చిరునామా

ఇక టికెట్ల పెంపునకు సంబంధించి రూల్స్ చూస్తే సింగిల్ స్క్రీన్ లో ఒక్కో టికెట్‌పై రూ.125 పెంచుకునేందుకు అనుమతి లభించింది. అలాగే మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్‌పై రూ.150 పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకూ పెంచిన టికెట్ ధరలు ఉండేలా ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైనర్స్ ఏపీ ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. హరిహర వీరమల్లు ఫ్లాప్ కావడంతో పవన్ ఫ్యాన్స్ “OG” కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుజిద్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైనర్స్‌ దీనిని నిర్మించింది. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా… బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్‌ హష్మీ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇమ్రాన్ హష్మీకి తెలుగులో ఇదే మొదటి సినిమా… ఇప్పటికే థమన్ అందించిన మ్యూజిక్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button