Mount Kailash: కైలాస పర్వతం రహస్యాలు.. ఆధ్యాత్మికత,మిస్టరీ
Mount Kailash:ఎవరెస్ట్ ఎక్కిన ఒక పర్వతారోహకుడు కైలాస పర్వతం ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు, అతడి గుండె వేగం విపరీతంగా పెరిగి, చేతి గోళ్లు, వెంట్రుకలు కూడా వేగంగా పెరిగాయట.

Mount Kailash
టిబెట్లో ఉన్న కైలాస శిఖరం, హిందువులకు, బౌద్ధులకు, జైనులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. శివుడు ఈ పర్వతంపై నివసిస్తాడని నమ్ముతారు. దీనిని చూడడానికి చాలామంది అమర్నాథ్ యాత్రకు వెళ్లి కైలాస శిఖరాన్ని కూడా దర్శించుకుని వస్తుంటారు. అయితే, ఈ పవిత్రమైన శిఖరాన్ని అధిరోహించడానికి కొన్ని సంవత్సరాల క్రితం అనుమతి ఉన్నా కూడా, ఇప్పుడు శాశ్వతంగా నిషేధించారు. ఈ నిషేధం వెనుక చాలా మిస్టరీ ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన పర్వతారోహకులు కూడా కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారు. వాస్తవానికి, కైలాస పర్వతం (Mount Kailash)ఎవరెస్ట్ కంటే చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. కానీ, ఎక్కడానికి ప్రయత్నించిన చాలామంది మరణించారని చెబుతారు. ఎవరెస్ట్ ఎక్కిన ఒక పర్వతారోహకుడు కైలాస పర్వతం ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు, అతడి గుండె వేగం విపరీతంగా పెరిగి, చేతి గోళ్లు, వెంట్రుకలు కూడా వేగంగా పెరిగాయట. శ్వాస తీసుకోవడం కూడా కష్టమవడంతో అతను కిందకు దిగాడు. కిందకు దిగగానే మళ్లీ అన్నీ సాధారణ స్థితికి వచ్చాయని అతడు చెప్పాడు. ఇలాంటి వింత పరిస్థితులు చాలామందికి ఎదురయ్యాయి. మనుషులు ఆ శిఖరాన్ని ఎక్కడం శివుడికి ఇష్టం లేదని భక్తులు నమ్ముతారు.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ శిఖరం(Mount Kailash)పై దిక్కులను సూచించే కంపాస్ కూడా పనిచేయదు. దీనికి కారణం, కైలాస శిఖరం భూమికి కేంద్ర బిందువులాంటిది అని, అన్ని దిక్కులు ఇక్కడే కలుస్తాయని చెబుతారు. అలాగే, ఈ శిఖరంపై ఎప్పుడు డమరుఖం శబ్దం వినిపిస్తుందని కొందరు భక్తులు చెబుతారు. పరిశోధకులు మాత్రం ఇది మంచు కరగడం వల్ల వచ్చే శబ్దం అయి ఉంటుందని అంటున్నారు. ఏది నిజం అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

కైలాస పర్వతం (Mount Kailash)పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇది మానవ నిర్మితమని ఒక రష్యన్ పరిశోధకుడు పేర్కొన్నాడు. కైలాసం ప్రాకృతికంగా ఏర్పడిన శిఖరం కాదని, ఎవరో వ్యక్తులు, లేదా ఏదో శక్తి దీనిని ఏర్పాటు చేసిందని ఆయన చెప్పాడు. ఇది నిజమైతే, ఆ శక్తి పరమశివుడిదేనని భక్తులు నమ్ముతారు. కైలాస పర్వతం లోపల మరో ప్రాంతం ఉందని, అందులో దేవుళ్లు ఇప్పటికీ కొలువై ఉన్నారని చాలామంది నమ్మకం. ఈ పర్వతం ఒక ప్రాకృతిక శక్తుల భాండాగారం. దానిపై ఉన్న మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.
One Comment