Just NationalLatest News

UNESCO :UNESCO తాత్కాలిక జాబితాలో ఏడు కొత్త భారతీయ ప్రదేశాలు

UNESCO :UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో మన దేశం నుంచి కొత్తగా ఏడు సహజ ప్రదేశాలు తాత్కాలిక జాబితాలో చేరాయి.

UNESCO

భారతదేశం తన సంస్కృతి, కళ, మరియు వారసత్వంతో ప్రపంచానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపును చాటుతోంది. ఈ గుర్తింపును మరింత పెంపొందించేందుకు, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో మన దేశం నుంచి కొత్తగా ఏడు సహజ ప్రదేశాలు తాత్కాలిక జాబితాలో చేరాయి. 2025లో ఈ జాబితాలో చేరిన వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎర్రమట్టి డబ్బాలు, తిరుమల హిల్స్, మేఘాలయలోని గుహలు, నాగాలాండ్ ఓఫియోలైట్, కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ద్వీపాలు, మహారాష్ట్రలోని దక్కన్ ట్రాప్స్, కేరళలోని వర్కల కొండలు ఉన్నాయి. ఈ అద్భుతమైన ప్రదేశాలు భారతీయ వారసత్వానికి కొత్త ఆశలను, కొత్త అడుగులను వేస్తున్నాయి.

UNESCO
UNESCO

1983లో భారతదేశం మొదటిసారిగా నాలుగు ముఖ్యమైన కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. అజంతా-ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్ మహల్. ఈ విజయంతో మొదలైన ప్రయాణంలో, భారతదేశం ఇప్పుడు 44కి పైగా ప్రపంచ వారసత్వ స్థావరాలను కలిగి ఉంది, ఆసియాలోనే అత్యధికంగా ఉన్న దేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో 36 సాంస్కృతిక కట్టడాలు, నగరాలు, గుహలు, మరియు 7 ప్రకృతి స్థావరాలు ఉన్నాయి.

UNESCO
UNESCO

UNESCO గుర్తింపు ద్వారా, మన ప్రాచీన కట్టడాలైన అజంతా-ఎల్లోరా గుహల నుంచి బౌద్ధ సాంప్రదాయాలు, తాజ్ మహల్ వంటి ముస్లిం కళా వైభవం, కొణార్క్ ఆలయం వంటి హిందూ శిల్ప సంపద ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వస్తాయి. అంతేకాకుండా, ఈ గుర్తింపు ద్వారా మన వారసత్వ సంపద సంరక్షణ, అభివృద్ధి కోసం విదేశాల నుండి నిధులు ,శాస్త్రీయ సహకారం లభిస్తుంది. ఉదాహరణకు, గతంలో ప్రమాదంలో ఉన్న వారసత్వంగా పరిగణించబడిన హంపిని, UNESCO ప్రాజెక్టుల ద్వారా సంరక్షించి, దాని ప్రాముఖ్యతను తిరిగి నిలబెట్టారు.

UNESCO
UNESCO

2025లో ‘మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్ ఆఫ్ ఇండియా’ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరాయి. ఈ గుర్తింపుతో, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వారసత్వ స్థావరాలు కలిగిన దేశాల్లో భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. అలాగే, 2024లో అస్సాం నుంచి ‘అహోం రాజవంశం యొక్క మైదాంలు’ కూడా ఈ జాబితాలోకి వచ్చాయి.

UNESCO
UNESCO

 

ఈ కొత్త గుర్తింపులు మన చారిత్రక సంపదను, దాని గొప్పతనాన్ని, మానవతావాద సారాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయి. ఈ గుర్తింపుల ద్వారా, మన వారసత్వ ప్రదేశాలపై మానవ దృష్టి, జాతీయ ప్రేమ , ప్రాంతీయ గర్వం పెరుగుతాయి.

భారతీయ సాహిత్యంలో, రామచరిత మానస్, రామాయణం, మహాభారతం, మరియు పంచతంత్ర వంటి గ్రంథాలు మానవ విలువలను ప్రపంచానికి చాటిచెప్పా ‘మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్’లో ఈ గ్రంథాలు జీవకళ, ధర్మం, పరస్పర సహాయ సూత్రాలను గుర్తించి వాటికి ప్రాముఖ్యత ఇచ్చింది.

Mount Kailash: కైలాస పర్వతం రహస్యాలు.. ఆధ్యాత్మికత,మిస్టరీ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button