Massaging: పాదాలకు ఆ ఆయిల్‌తో మసాజ్ చేస్తే ఇన్ని ఉపయోగాలుంటాయా?
Massaging: మసాజ్ చేయడం వల్ల పాదాలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజు మొత్తం శ్రమ కారణంగా కండరాలలో పేరుకుపోయిన ల్యాక్టిక్ యాసిడ్ వంటి వ్యర్థ పదార్థాలు వేగంగా తొలగిపోతాయి.

Massaging
ఆధునిక జీవనశైలిలో, పడుకునే ముందు మన పాదాలను పట్టించుకోవడం పూర్తిగా మర్చిపోయాం. నిజానికి, పాదాలకు రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం అనేది కేవలం చర్మ సంరక్షణ మాత్రమే కాదు, మెరుగైన నిద్రకు, మానసిక ప్రశాంతతకు ఒక అద్భుతమైన మార్గం అని అంటున్నారు నిపుణులు.
ఆలివ్ నూనెతో పాదాలకు మసాజ్ (Massaging)చేయడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటానికి ప్రధాన కారణం రిఫ్లెక్సాలజీ (Reflexology). ఆయుర్వేదం,సాంప్రదాయ వైద్య విధానాల ప్రకారం, మన పాదాల అడుగున శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించిన ముఖ్యమైన నరాల కేంద్రాలు ఉంటాయి.
పాదాలకు మసాజ్ చేసినప్పుడు, ఆ ఒత్తిడి, మసాజ్ (Massaging)వేడి ఆ నరాల కేంద్రాలను ఉత్తేజపరుస్తాయి. ఇది మెదడుకు, శరీరంలోని ఇతర భాగాలకు ప్రశాంతపరిచే సిగ్నల్స్‌ను పంపి, పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను (Parasympathetic Nervous System) చురుకుగా చేస్తుంది. ఈ వ్యవస్థనే “విశ్రాంతి, మరియు జీర్ణక్రియ” (Rest and Digest) వ్యవస్థ అని అంటారు.

పారాసింపథెటిక్ వ్యవస్థ ఉత్తేజం కావడం వల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు నెమ్మదిగా తగ్గి, మనసు, శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకునే స్థితికి చేరుకుంటాయి. దీంతో రాత్రి పడుకోగానే వేగంగా, లోతైన నిద్ర పడుతుంది. ఆలివ్ నూనెలో సహజంగానే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కేవలం మాయిశ్చరైజర్‌గా మాత్రమే కాక, కండరాల నొప్పికి ఉపశమనం కలిగించడంలో కూడా సహాయపడుతుంది. మసాజ్ (Massaging)చేయడం వల్ల పాదాలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజు మొత్తం శ్రమ కారణంగా కండరాలలో పేరుకుపోయిన ల్యాక్టిక్ యాసిడ్ వంటి వ్యర్థ పదార్థాలు వేగంగా తొలగిపోతాయి.
ఈ ప్రక్రియ కాళ్లు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది, ముఖ్యంగా ఎక్కువ సమయం నిలబడేవారికి, లేదా నడిచేవారికి ఇది బాగా పనిచేస్తుంది. ఆలివ్ నూనె చర్మం పొడిబారకుండా, పగిలిపోకుండా కాపాడుతుంది. ముఖ్యంగా, ఆలివ్ నూనెలో ఉండే సహజమైన విటమిన్లు, మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని పోషించి, మృదువుగా ఉంచుతాయి. కాబట్టి, రాత్రి పడుకునే ముందు కాళ్లకు గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం అనేది శారీరక, మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక సరళమైన, మరియు శక్తివంతమైన చిట్కాగా చెప్పుకోవచ్చు.
One Comment