just AnalysisJust PoliticalLatest News

CM Vijay : తమిళనాడులో సీఎం విజయ్ మార్క్ పాలిటిక్స్.. దళపతి పాలన ఎలా ఉంది?

CM Vijay : సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ చేసిన తొలి మూడు సంతకాలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన సందేశాన్ని ఇచ్చాయి

CM Vijay

వెండితెరపై తన యాక్షన్‌తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు సీఎం పీఠంపై కూర్చుని పరిపాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్(CM Vijay).. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఊహించని నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఓవైపు ప్రజా సంక్షేమం, మరోవైపు సామాజిక క్రమశిక్షణ అనే రెండు అక్షాలపై తన పాలనను నిర్మిస్తున్నారు.

ముఖ్యంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ చేసిన తొలి మూడు సంతకాలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన సందేశాన్ని ఇచ్చాయి. అందులో ఫస్ట్ సంతకం 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఇచ్చే పథకంపై కాగా, ఇది పెరుగుతున్న కరెంట్ బిల్లుల భారంతో సతమతమవుతున్న పేద ,మధ్యతరగతి గృహ వినియోగదారులకు పెద్ద రిలీఫ్‌ను ఇచ్చింది.

ఇక సెకండ్ సంతకం మహిళా సేఫ్టీ కోసం షీ-టీమ్స్ తరహాలో ఒక స్పెషల్ రక్షణ దళాన్ని ఏర్పాటు చేయడం. మహిళలపై జరిగే వేధింపులను అరికట్టడం, రాత్రివేళల్లో భద్రత, సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచడం కోసం ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

తమిళనాడులో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకునే ఫైల్‌పై మూడో సైన్ చేశారు. ఇది కేవలం పోలీసుల దాడుల వరకే కాకుండా డ్రగ్స్ సప్లై చైన్, ఆన్‌లైన్ మనీ నెట్‌వర్క్, అంతర్రాష్ట్ర రూట్లు, హాస్టల్ , పార్టీ కల్చర్‌ను పూర్తిగా బద్దలు కొట్టేలా ఒక సమగ్ర ప్లాన్‌తో సాగుతోంది.

ఈ సంక్షేమ నిర్ణయాలతో పాటు సోషల్ కంట్రోల్ కోసం ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) తీసుకున్న మరో కీలకమైన నిర్ణయం లిక్కర్ షాపులపై కఠినమైన ఆంక్షలు విధించడం. ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్ల వంటి ప్రజా ప్రదేశాలకు దాదాపు 500 మీటర్ల పరిధిలో ఉన్న లిక్కర్ షాపులను మూసివేయడం లేదా అక్కడి నుంచి తరలించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నిర్ణయం వల్ల తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 717 మద్యం దుకాణాలు ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. మద్యం వ్యాపారం అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద ఆదాయ వనరు అయినా సరే..మోరాలిటీ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, పీస్‌ ఆఫ్ ఫ్యామిలీసీ , ఉమెన్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడం ప్రజల్లో పెద్ద ఎత్తున సానుకూలతను తెచ్చిపెట్టింది.

ఇదే సమయంలో రైతు పంట రుణమాఫీ విషయంలో విజయ్ సర్కార్ వ్యవహరించిన తీరు విజయ్ పరిపాలనా శైలికి అద్దం పడుతోంది. మొదట ప్రకటించిన కండీషన్లపై రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను, నిరసనలను గమనించిన ప్రభుత్వం, పట్టుదలకు పోకుండా ప్రజల ఒత్తిడికి వెంటనే రియాక్టయ్యి నిబంధనలను మరింత ఉదారంగా సవరించింది.

దీని ప్రకారం సహకార బ్యాంకుల ద్వారా రూ. 75 వేల వరకు క్రాప్ లోన్స్ తీసుకున్న రైతులకు పూర్తి మాఫీ దొరుకుతుంది. అంతకంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతులకు రూ. 35 వేల చొప్పున రుణం నుంచి విముక్తి కల్పిస్తామని ప్రకటించారు.

ఈ నిర్ణయం వల్ల సుమారు 14.43 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరబోతోంది. గవర్నమెంట్ ఖజానాపై సుమారు రూ. 5,932 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రజల ఆందోళనలను గౌరవించి తన నిర్ణయాన్ని మార్చుకోవడం అనేది ఒక స్పందనాత్మక ప్రభుత్వానికి నిదర్శనంగా నిలిచింది.

ఇలాంటి ఉచితాలు, రాయితీలు, రుణమాఫీలు ఇస్తూ, మరోవైపు పారదర్శక పరిపాలన కోసం తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తానని ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) ప్రకటించడం విశేషం. ప్రజాధనాన్ని ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయబోనని చెప్పడం ద్వారా తాము కేవలం పాపులిస్టిక్ పథకాలనే కాదు ఆర్థిక క్రమశిక్షణను కూడా పాటిస్తామనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారు.

CM Vijay
CM Vijay

ఒకవైపు ఇళ్లకు ఫ్రీ కరెంట్, రైతులకు రుణమాఫీ ఇస్తూ, మరోవైపు డ్రగ్స్, లిక్కర్ షాపులపై కఠినమైన రూల్స్ విధించే ఈ మిశ్రమ పాలనా శైలి కొన్ని వర్గాలకు అసౌకర్యం కలిగించినా, పేదలు, మహిళలు, యూత్, రైతులపై మాత్రం దీని ప్రభావం చాలా బలంగా ఉంది. సీఎం విజయ్(CM Vijay) తీసుకుంటున్న ఈ తొలి అడుగులు కేవలం టెంపరరీ హడావుడి మాత్రమేనా లేక విజయ్ తీసుకురాబోయే నిజమైన మార్పా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ సరికొత్త రాజకీయ ప్రయోగం తమిళనాడులోనే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజల దృష్టిని కూడా ఆకట్టుకుంటోంది.

Janasena : తెలంగాణలో జనసేన ఇక యాక్టివ్..19న పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం

Related Articles

Back to top button