Varalakshmi Vratam : శ్రీపద్మావతి అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం..మీరూ పాల్గొనాలని అనుకుంటున్నారా?
Varalakshmi Vratam : ప్రతీ ఏడాది కూడా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం తరతరాలుగా వస్తున్న ఆచారంగా కొనసాగుతుంది.
Varalakshmi Vratam
శ్రావణ మాసం వచ్చిందంటేనే చాలు ప్రతీ ఇల్లు కూడా వరలక్ష్మీ దేవి పూజలతో కళకళలాడుతూ ఉంటుంది. అటువంటిది సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపమైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆ చల్లని తల్లి ఆశీస్సులతో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే వచ్చే ఆ పుణ్యఫలం వేరుగా ఉంటుందని పండితులు చెబుతారు.
దీనికోసం శ్రీ వేంకటేశ్వరుడి భక్తులకు, ముఖ్యంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఆగస్టు 21న తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడానికి టీటీడీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
తిరుచానూరు ఆస్థాన మండపంలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి టీటీడీ జేఈవో డాక్టర్ ఎ.శరత్ పక్కా ప్లానింగ్ రివ్యూ మీటింగ్ కూడా పూర్తి చేశారు.
ఆగస్టు 21 వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రత(Varalakshmi Vratam) పూజా కార్యక్రమాలు ఘనంగా జరగబోతున్నాయి. ఇక సాయంత్రం 6 గంటలు కాగానే జగన్మాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారు సర్వాభరణ భూషితురాలై స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం టీటీడీ అధికారులు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో మొత్తం 500 టికెట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఆన్లైన్ కోటా టికెట్లను బుధవారం ఉదయం 10 గంటల నుంచే టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఒకవేళ ఆన్లైన్లో మిస్ అయినా సరే భక్తులు కంగారు పడక్కర్లేదు. ఆగస్టు 20వ తేదీన ఆఫ్‌లైన్ కౌంటర్లలో ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్ అంటే ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత పద్ధతిలో ఈ వ్రత టికెట్లను జారీ చేస్తారు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. ఒక టికెట్‌పై భార్యాభర్తలు ఇద్దరూ కూడా పూజలో కూర్చోవడానికి అనుమతిస్తారు. అయితే వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratam) సందర్భంగా ఆరోజు అమ్మవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, అభిషేకం, లక్ష్మీపూజ, కళ్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.

సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అవతరించిన పవిత్ర నేలగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కొలుస్తారు కాబట్టి.. ఆ ఆలయంలో జరిగే వరలక్ష్మీ వ్రతానికి(Varalakshmi Vratam) పురాణాల్లో విశేషమైన ప్రాధాన్యత ఉంది.
సాధారణంగా ప్రతీ ఏడాది కూడా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ పూజను ఆచరించడం తరతరాలుగా వస్తున్న ఆచారంగా కొనసాగుతుంది. ఈరోజు భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని కొలిచే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్త్యంతో పాటు సంతాన సౌభాగ్యం, సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, ఇతర కోరికలు తీరుతాయని వేద పండితులు చెబుతారు.
Special Person : మనసుకు ఒక సేఫ్ పర్సన్ అవసరమా? సంతోషమైనా, బాధ అయినా వాళ్లతో పంచుకుంటే సరిపోతుందా?





