just AnalysisJust InternationalLatest News

Earth : బ్రెయిన్ కంటే పవర్‌ఫుల్ నెట్‌వర్క్ భూమి లోపల ఉందా? ఇది మనుషుల్ని ఎంతలా కాపాడుతుందో తెలుసా?

Earth : ఫంగల్ నెట్‌వర్క్ మొత్తం పొడవు ..అక్షరాలా సుమారు 110 క్వాడ్రిలియన్ కిలోమీటర్ల పొడవునా భూమి లోపల అల్లుకుపోయింది

Earth

భూమి పైన ఉండే చెట్లు, అడవులు, అందమైన ప్రకృతిని చూసి మనమంతా మురిసిపోతాం. అయితే భూమి(Earth) లోపల కంటికి కనిపించని ఒక అద్భుతమైన మాయా ప్రపంచం ఉందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మన గ్రహం మనుగడకు అత్యంత కీలకమైన ఒక భారీ శిలీంధ్రాల వ్యవస్థ అంటే ఫంగల్ నెట్‌వర్క్ భూగర్భంలో విస్తరించి ఉందని శాస్త్రవేత్తలు రీసెంట్‌గా గుర్తించారు.

ఫంగల్ నెట్‌వర్క్ మొత్తం పొడవు ..అక్షరాలా సుమారు 110 క్వాడ్రిలియన్ కిలోమీటర్ల పొడవునా భూమి(Earth) లోపల అల్లుకుపోయింది. నిజానికి ఈ దూరం ఎంత పెద్దదంటే..భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి ఇది సుమారు వంద కోట్ల రెట్లు ఎక్కువట. ఈ భూగర్భ సీక్రెట్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఒక పర్ఫెక్ట్ గ్లోబల్ మ్యాప్‌ను సైంటిస్టులు తొలిసారిగా విడుదల చేశారు.

శాస్త్రీయంగా ఆర్బస్కులర్ మైకోరైజల్ అని పిలిచే ఈ సూక్ష్మ ఫంగల్ నెట్‌వర్క్.. భూమిపై ఉన్న సుమారు 70 శాతం మొక్కలతో ఒక క్రేజీ ఫ్రెండ్షిప్‌నే మెయింటైన్ చేస్తుందట. దీనినే సైంటిస్టులు ఇంటర్నెట్ లాగా వుడ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తున్నారు.

చెట్లు, మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకునే షుగర్స్‌ను ఈ ఫంగస్ స్వీకరిస్తుంది. దానికి రిటర్న్ గిఫ్ట్‌గా, తన దారాల వంటి పొడవాటి నిర్మాణాలను వేర్ల కంటే ఎంతో లోపలికి విస్తరించి.. మొక్కలకు అందనంత దూరంలో ఉండే నీరు, ఫాస్ఫరస్, నైట్రోజన్ లాంటి చాలా చాలా ముఖ్యమైన పోషకాలను తెచ్చి మొక్కలకు అందిస్తుందట. అంటే భూమి లోపల ఒకరికొకరు హెల్ప్ చేసుకునే సూపర్ బిజినెస్ నెట్‌వర్క్ నడుస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్స్.. పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000కు పైగా మట్టి నమూనాలను సేకరించి,దీనిపై డెప్త్‌గా రీసెర్చ్ చేసి ఈ గ్లోబల్ మ్యాప్‌ను డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సైన్స్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.

ఈ భూగర్భ నెట్‌వర్క్ దాదాపు 300 మెగాటన్నుల కార్బన్‌ను తనలో దాచి పెట్టుకుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ కార్బన్ విలువ ఎంతంటే, భూమి(Earth)పై ఉన్న మొత్తం మానవ జాతి బరువు కంటే ఇది 4 నుంచి 6 రెట్లు ఎక్కువ. వాతావరణంలో హీట్‌ని పెంచే కార్బన్‌ను భూమి లోపల నొక్కిపెట్టి.. గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా ఈ నెట్‌వర్క్ మనల్ని కాపాడుతోంది.

Earth
Earth

అయితే, ఇలాంటి అద్భుతమైన సహజ నెట్‌వర్క్‌ను మనుషులే నాశనం చేస్తున్నారని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. మనం వాడుతున్న లేటెస్ట్ వ్యవసాయ పద్ధతులు, విచ్చలవిడిగా చల్లుతున్న కెమికల్ ఎరువులు, ట్రాక్టర్లతో భూమిని విపరీతంగా దున్నేయడం వంటి కారణాల వల్ల ఈ భూగర్భ నెట్‌వర్క్ ముక్కలైపోతోంది.

దీనికి ఉదాహరణగా అడవులతో పోలిస్తే పంటలు పండించే వ్యవసాయ భూముల్లో.. ఈ ఫంగస్ సాంద్రత 50 శాతం పడిపోయిందని వీరి రీసెర్చ్‌లో తేలింది. రాబోయే రోజుల్లో ఆహార భద్రత బాగా ఉండాలన్నా, పర్యావరణం సమతుల్యంగా ఉండాలన్నా.. కంటికి కనిపించకుండా మనుషుల్ని బ్రతికిస్తున్న ఈ భూగర్భ నెట్‌వర్క్‌ను కాపాడుకోవడం చాలా అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు.

Virgo : పర్‌ఫెక్షనిస్ట్‌లకు కేరాఫ్ కన్యారాశి వారు .. ఈ రాశి వారు ఈ తప్పులు చేస్తుంటారు

Related Articles

Back to top button