Just Andhra PradeshJust PoliticalLatest News

Amaravati Bill : అమరావతి చట్టబద్ధత బిల్లు…ఉభయ సభల్లో ఆమోదం

Amaravati Bill : ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది

Amaravati Bill

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. గత వారం ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపగా నిన్న లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఐదు గంటల చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది.

తర్వాత అమరావతికి చట్టబద్ధత బిల్లు(Amaravati Bill) ఇవాళ రాజ్యసభకు చేరింది. పెద్దల సభలోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు మద్దతు పలికాయి. అయితే వైసీపీ మాత్రం బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ వాకౌట్ చేసింది. వాకౌట్ కు ముందు ఆ పార్టీ ఎంపి వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతికి తాము వ్యతిరేకం కాదనీ, అక్కడ అవినీతిపైనే తమకు అభ్యంతరమంటూ చెప్పుకొచ్చారు. వేల ఎకరాలు తీసుకుని ఇప్పటి వరకూ అభివృద్ధి చేయలేదన్నారు. ఈ బిల్లులో అంశాలపై స్పష్టత లేదని, ప్రత్యేక హోదా ఊసే లేదని విమర్శించారు.

అందుకే వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పిన వైవీ సుబ్బారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. నిన్న లోక్ సభలోనూ వైసీపీ ఎంపీలు నాకౌట్ చేశారు. కాగా బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ ఛైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Amaravati Bill
Amaravati Bill

మరోవైపు రాజ్యసభలోనూ ఆమోదం లభించడంతో అమరావతికి చట్టబద్ధత బిల్లు(Amaravati Bill) రాష్ట్రపతి దగ్గరకు వెళ్లనుంది. రాష్ట్రపతి సంతకం తర్వాత బిల్లు చట్టంగా మారుతుంది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ బిల్లులో పొందుపరిచారు. లోక్ సభ, రాజ్యసభల్లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంతో ఏపీలో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు.

అమరావతి ప్రాంతానికి వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడి రైతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పలు జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు , నేతలు, కార్యకర్తలు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అమరావతి చట్టబద్ధత బిల్లు అంతా డ్రామా అని, చంద్రబాబు, ఆయన బినామీలు ఇక్కడ భూములను దోచుకోవడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు.

Sri Lanka Cricket : ఐపీఎల్ ఆడకుండా అడ్డుకున్నారు…సొంత బోర్డుపై లంక ప్లేయర్ కేసు

Related Articles

Back to top button