Just Andhra PradeshLatest News

Mini Amazon Forest : అమరావతి గుండెల్లో పచ్చని అద్భుతం.. ముస్తాబవుతున్న మినీ అమెజాన్ అడవి

Mini Amazon Forest : చెట్లను పెంచడంతో పాటు పక్షులు, కీటకాలు, చిన్న వన్యప్రాణులు ఉదాహరణకు కుందేళ్లు, నెమళ్లు జీవించడానికి వీలుగా సహజసిద్ధమైన చిన్న చిన్న ఆవాసాలను కూడా క్రియేట్ చేస్తున్నారు.

Mini Amazon Forest

ఏపీ రాజధాని అమరావతిలో పర్యాటకాన్ని సరికొత్త పుంతలు తొక్కించడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే అమరావతిలో నిర్మిస్తున్న శాఖమూరు పార్కు ప్రాంగణంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఒక అద్భుతమైన మినీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్(Mini Amazon Forest) ప్రాజెక్టును తీసుకురాబోతోంది. సుమారు రూ. 17 కోట్ల పైచిలుకు వ్యయంతో ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు ప్రణాళికలు రెడీ అయ్యాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా జపాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ మియావాకీ మెథడ్‌ని ఉపయోగించి దట్టమైన అడవిని పెంచుతారు. దీనివల్ల చాలా తక్కువ స్థలంలోనే ఎక్కువ చెట్లను దట్టంగా పెంచే వీలుంటుంది. దీనిలో సుమారు 20 వేలకు పైగా చెట్లు, 4 వందలకు పైగా రకాల మొక్కలను నాటబోతున్నారు.

ఈ పచ్చదనం వల్ల రాజధాని ప్రాంతంలో ఎయిర్ పొల్యూషన్ గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, ఈ అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే రెయిన్ గన్స్, మిస్ట్ సిస్టమ్స్ వల్ల అక్కడి టెంపరేచర్‌ సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండి, ఎప్పుడూ చల్లని వాతావరణాన్ని అందిస్తుంది.

అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చడంలో కూడా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషియల్‌గా సృష్టించే జలపాతాలు, నీటి కాలువలు, వెదురుతో చేసిన బాంబూ వాక్‌వేస్, పచ్చని వ్యూ డెక్స్ వంటి ఆకర్షణలు నేచర్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తారు. దీనివల్ల లోకల్‌గా హోటళ్లు, ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ వంటివి మెరుగుపడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ప్రాజెక్టులో కేవలం చెట్లను పెంచడంతో పాటు పక్షులు, కీటకాలు, చిన్న వన్యప్రాణులు ఉదాహరణకు కుందేళ్లు, నెమళ్లు జీవించడానికి వీలుగా సహజసిద్ధమైన చిన్న చిన్న ఆవాసాలను కూడా క్రియేట్ చేస్తున్నారు. అంతరించిపోతున్న దేశీయ వృక్ష జాతులకు ఈ ప్రాజెక్టులో ప్రాధాన్యమివ్వడం వల్ల ఫ్యూచర్ జనరేషన్‌కు ఈ మొక్కలన్నీ అందుబాటులో ఉంటాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఇదొక అద్భుతమైన ప్రయోగం అవుతుంది.

ఇక్కడ పెరిగే వృక్షజాతులు, వాటి ఇంపార్టెన్స్ గురించి సందర్శకులు ఈజీగా తెలుసుకునేలా స్పెషల్ సమాచార బోర్డులను ఏర్పాటు చేస్తారు. స్కూలు స్టూడెంట్స్‌కు , పరిశోధకులకు ఇదొక ఓపెన్ క్లాస్‌రూమ్ లాగా ఉపయోగపడుతుంది. పర్యావరణ పరిరక్షణ , అటవీ సంరక్షణపై అవగాహన పెంచడానికి ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్మించనున్నారు.

Mini Amazon Forest
Mini Amazon Forest

కాంక్రీట్ కట్టడాల మధ్య మెకానికల్ లైఫ్ గడుపుతున్న సిటీ ప్రజలకు వీకెండ్స్‌లో సేద తీరడానికి ఇది గొప్ప ప్రదేశం అవుతుంది. కంటిన్యూ కురిసే చిరుజల్లుల మధ్య రెయిన్ వాక్‌వే, ఆర్టిఫిషియల్ సెలయేళ్ల పక్కన ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది.

మొత్తంగా రాజధాని అమరావతికి ఒక ప్రత్యేకమైన పర్యావరణ హితమైన ఐడెండిటీని తీసుకురావడంలో ఈ మినీ అమెజాన్(Mini Amazon Forest) ప్రాజెక్టు.. అత్యంత కీలకమైన మైలురాయిగా మారబోతోందనడంలో సందేహం లేదు.

Gorintaku : గోరింటాకు పెట్టుకోవడం అందం కోసమా? ఆరోగ్యం కోసమా? ఆషాఢంలో గోరింటాకు వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఏంటి?

Related Articles

Back to top button