AP IAS Transfers : ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో కీలక నిర్ణయం.. ఏపీ భవన్ నుంచి పౌరసరఫరాల వరకూ కొత్త ఆఫీసర్లు..
AP IAS Transfers : ఏపీ వ్యాప్తంగా కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడమే కాకుండా.. మరికొంతమందికి పూర్తి అడిషనల్ ఛార్జీలు ఇస్తూ అఫీషియల్ జీవో (GO Rt No. 1985) జారీ చేసింది.
AP IAS Transfers
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా వేగాన్ని మరింత పెంచే టార్గెట్‌తో కూటమి ప్రభుత్వం ఐఏఎస్ వ్యవస్థలో కీలక మార్పులను చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ(AP IAS Transfers) చేయడమే కాకుండా.. మరికొంతమందికి పూర్తి అడిషనల్ ఛార్జీలు ఇస్తూ అఫీషియల్ జీవో (GO Rt No. 1985) జారీ చేసింది. ఇంపార్టెంట్ శాఖలలో సమర్థులైన అధికారులను నియమించడం ద్వారా పథకాలు, సర్వీసులను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఏపీ సర్కార్ ఈ షఫుల్ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ తాజా బదిలీలలో(AP IAS Transfers) ముఖ్యంగా ఢిల్లీలోని ఏపీ భవన్ ఓఎస్డీ( OSD)గా సీనియర్ అధికారి సౌరభ్ గౌర్‌ను పంపించగా, గతంలో వివిధ కేటగిరీలలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆమ్రపాలిని ఈసారి పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించారు. డి. మురళీధర్ రెడ్డికి గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలను అలాగే మంజులే బాలాజీ దిగంబర్‌కు.. ఈడబ్ల్యూఎస్ (EWS) సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించారు.

ఇక సంక్షేమ, పౌరసరఫరాల విభాగాలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీ పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా ఎం. వరప్రసాద్.. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ఎన్. తేజ్ భరత్‌ను నియమించింది. యంగ్‌మెన్, యువజన సేవల విభాగం డైరెక్టర్‌గా కె. నీలకంఠ రెడ్డి, అలాగే ఎంఎస్ఎంఈ (MSME), ఇండస్ట్రీల సంయుక్త కార్యదర్శిగా బి. అనిల్ కుమార్ రెడ్డి, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు శాఖ ఉప కార్యదర్శిగా గెడెల శ్రీనుకుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.

అంతేకాకుండా కె. శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్‌గా నియమించింది. అలాగే శుభం బన్సాల్‌కు.. ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ (APFC) మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ఇచ్చింది. తాజాగా జారీ చేసి ఈ ఆర్డర్స్ వెంటనే అమల్లోకి వస్తున్నాయని, అధికారులు వెంటనే విధుల్లో చేరాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Raw Banana : అరటి పండుని పక్కనబెట్టండి.. అరటికాయ మ్యాజిక్‌ను తెలుసుకోండి..





