Just Andhra PradeshJust PoliticalLatest News

MPTC -ZPTC Counting : కాసేపట్లో పల్లె పోరు ఫలితాలు..తేలనున్న ఎంపీటీసీ-జడ్పీటీసీ అభ్యర్థుల జాతకాలు

MPTC -ZPTC Counting : ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల్లో భారీ భద్రత మధ్య కౌంటింగ్ కొనసాగుతోంది.

MPTC -ZPTC Counting

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పోరులో అసలైన ఉత్కంఠ ఘట్టం వేగంగా కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు(MPTC -ZPTC Counting) ప్రాసెస్ నవంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కౌంటింగ్ నిరంతరాయంగా కొనసాగనుంది. పల్లె ఓటరు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల నుంచి బయటకు రానుండటంతో అన్ని పార్టీలలో ఆందోళన, ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం కల్లా ఎంపీటీసీ-జడ్పీటీసీ విజేతలెవరో తెలిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఏపీ వ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో ఇప్పటికే 77 ఏకగ్రీవమయ్యాయి. దాంతో మిగిలిన 582 స్థానాలకు నవంబర్ 5న పోలింగ్ జరిగింది. అలాగే 9,821 ఎంపీటీసీ స్థానాలలో 2,051 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,767 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ స్థానాలకు సాయంత్రం వరకూ జరగనున్న ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తి చేయడానికి అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు.

ఈ కౌంటింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయడానికి 28 జిల్లాల పరిధిలోని 365 కేంద్రాల్లో 9,062 టేబుల్స్‌ను సిద్ధం చేశారు. ప్రతీ టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్‌తో పాటు 11వేల2 మంది అసిస్టెంట్లు, 28వేల692 మంది కౌంటింగ్ సహాయకులు కలిపి మొత్తం 39వేల694 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల కోసం పనిచేస్తున్నారు.

MPTC -ZPTC Counting
MPTC -ZPTC Counting

కౌంటింగ్ కేంద్రాల వద్ద కానీ, చుట్టు పక్కల కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 40వేల679 మంది పోలీసులతో కట్టుదిట్టమైన మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాల నిఘాను ఉంచగా, ఈ వీడియో ఫుటేజ్‌ని ఏపీ ఎన్నికల సంఘం 60 రోజుల పాటు భద్రపరుస్తుంది. నిబంధనల ప్రకారం మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి..ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు. ప్రతి టేబుల్‌కు ఒక రౌండ్‌లో 1,000 బ్యాలెట్ పత్రాల చొప్పున కౌంటింగ్ జరుపుతున్నారు.

Love Life : కెరీర్ సక్సెస్, లవ్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలా? రొటీన్‌ లైఫ్‌ను కొంచెం చేంజ్‌ చేస్తే చాలా?

Related Articles

Back to top button