Just Andhra PradeshJust SpiritualLatest News

Indrakeeladri : ఇంద్రకీలాద్రి నవరాత్రులకు హైటెక్ టచ్.. దసరా ఉత్సవాల టికెట్లు ఇక మీ వాట్సాప్‌లోనే..

Indrakeeladri : మొబైల్ నుంచి 9552300009 అనే వాట్సాప్ నెంబర్‌కు ఒక చిన్న మెసేజ్ పంపడం ద్వారా ఇంటి నుంచే డైరెక్టుగా దసరా ఉత్సవాల టికెట్లను నిమిషాల్లో బుక్ చేసుకోవచ్చు

Indrakeeladri

విజయవాడ కనకదుర్గ అమ్మవారి దివ్య దర్శనానికి ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై కన్నుల పండువగా జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల కోసం.. ఈసారి భక్తుల దర్శన అనుభవాన్ని ఫుల్ డిజిటలైజ్ చేశారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు సాగే ఈ వేడుకల కోసం స్పెషల్ సేవా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ ప్రాసెస్ అఫీషియల్‌గా ప్రారంభమైంది.

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈసారి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా .. భక్తులెవరికీ క్యూలైన్ల తిప్పలు లేకుండా వేగవంతమైన, పారదర్శకమైన దర్శన సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

ఈ కొత్త విధానంతో దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇకపై టికెట్ల కోసం కౌంటర్ల వద్ద గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వారి మొబైల్ నుంచి 9552300009 అనే వాట్సాప్ నెంబర్‌కు ఒక చిన్న మెసేజ్ పంపడం ద్వారా ఇంటి నుంచే డైరెక్టుగా దసరా ఉత్సవాల టికెట్లను నిమిషాల్లో బుక్ చేసుకోవచ్చు.

నవరాత్రుల సమయంలో ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై కనక దుర్గమ్మ వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ప్రత్యేక చండీ హోమం, దేవీ ఖడ్గమాలార్చన, ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చన, కుంకుమార్చన వంటి ముఖ్యమైన సేవలన్నికూడా ముందుగా బుక్ చేసుకోవడానికి వీలుగా డిజిటల్ బుకింగ్ వెసులుబాటు కల్పించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు శ్రమను తగ్గించి, ఆలయం వద్ద రద్దీని అదుపులో ఉంచడానికి ఈ హైటెక్ స్మార్ట్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడబోతోందని అధికారులు భావిస్తున్నారు.

Indrakeeladri
Indrakeeladri

ఈ మహోత్సవాల ప్రారంభం కోసం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ..విజయవాడ కనకదుర్గ ఆలయ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ , ఈవో శీనానాయక్ మొదటి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వాన పత్రికతో పాటు దేవాదాయ మంత్రికి అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని సమర్పించి అర్చకులు వేద ఆశీర్వచనాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆనం.. దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై కనక దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులెవరికీ చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే తాగునీరు, క్యూలైన్లు,అమ్మవారి ప్రసాదాల పంపిణీ విషయంలో అన్ని ఏర్పాట్లను పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేయాలని చెప్పారు. కాగా భక్తికి టెక్నాలజీ కూడా జత కూడడంతో ఈసారి ఇంద్రకీలాద్రి దసరా వేడుకలు భక్తులకు ఒక డిజిటల్, డివైన్ అనుభూతిని అందించనున్నాయి.

Reassurance : ఆమె అలిగినప్పుడు మీరు ఇవ్వాల్సిన అసలైన భరోసా ఇదే..ఈగో పక్కనబెట్టి ఈ ఒక్క పని చేయండి..

Related Articles

Back to top button