Janasena Party : స్థానిక సమరానికి జనసేనాని పక్కా వ్యూహం..జనసేనలోకి క్యూ కడుతున్న ఎమ్మెల్యే స్థాయి లీడర్లు..
Janasena Party : పక్కా ప్లానింగ్‌తో ఆపరేషన్ ఆకర్ష్‌ను అమల్లోకి తెచ్చిన పవన్ కళ్యాణ్.. వైసీపీలో అసంతృప్తి సెగలు కక్కుతూ ప్రజాదరణతో పాటు నాన్-కాంట్రవర్సియల్ లీడర్లుగా పేరున్న సీనియర్లకు పార్టీలో చోటిస్తున్నారు.
Janasena Party
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల హీట్ గట్టిగా తాకుతోంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికల పోల్స్‌ను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్న జనసేన అధినాయకత్వం.. ఓవైపు కూటమి పార్టీల వద్ద సీట్ల షేరింగ్‌పై గట్టిగా పట్టుబడుతూనే, మరోవైపు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ ఆపరేషన్ చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. నామ్ కే వాస్తే అనేలా పోటీ చేయడం కాకుండా, నిలబడిన ప్రతి చోటా గెలిచి తీరాలనే మైండ్ సెట్‌తో పార్టీ ముందుకు వెళ్తోంది.
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డైరెక్టుగా జాయినింగ్స్‌పై ఫోకస్ పెట్టగా, పార్టీలో మెయిన్ లీడర్స్ అంతా క్షేత్రస్థాయి పరిస్థితులపై స్టడీ చేస్తూ గ్రౌండ్ లెవెల్ బల నిరూపణకు రూట్ మ్యాప్‌ను రెడీ చేస్తున్నారు.
ఈసారి ఆపరేషన్ ఆకర్ష్‌ను పక్కా ప్లానింగ్‌తో అమల్లోకి తెచ్చిన పవన్ కళ్యాణ్.. వైసీపీలో అసంతృప్తి సెగలు కక్కుతూ ప్రజాదరణతో పాటు నాన్-కాంట్రవర్సియల్ లీడర్లుగా పేరున్న సీనియర్లకు పార్టీలో చోటిస్తున్నారు.
ఇప్పటికే ప్రత్తిపాడు నుంచి వరుపుల సుబ్బారావు అలాగే తుని నుంచి యనమల కృష్ణుడుతో పాటు హిందూపురం నుంచి నవీన్ నిచ్చల్ వంటి ఎమ్మెల్యే రేంజ్ లీడర్స్‌కు పవన్ స్వయంగా కండువా కప్పారు.
గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే సామినేని ఉదయభానుతో పాటు కిలారి రోశయ్య వంటి హేమాహేమీలను తమ వైపు లాగిన జనసేన.. ఇప్పుడు విలేజ్ స్థాయి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు వలసల జోరును మరింతగా పెంచుతోంది.
అయితే పవన్ కళ్యాణ్ మాస్టర్ మైండ్‌తో ఆలోచిస్తున్నారని అందుకే పార్టీలోకి ఎవరిని పడితే వారిని చేర్చుకోవడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత కూటమి భాగస్వాములైన టీడీపీ, బీజేపీతో గొడవలు కొని తెచ్చుకోవడానికి పవన్ సిద్ధంగా లేరన్న విషయాన్ని వీరు హైలైట్ చేస్తున్నారు .
గతంలో ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ అలాగే దామచర్ల జనార్ధన్ మధ్య నడిచిన వివాదాలు మరోసారి రిపీట్ కాకూడదనే ఉద్దేశంతోనే పవన్ ఇలా అడుగులు వేస్తున్నారు. కూటమి పార్టీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారికి అనుకూలంగా ఉండే నేతలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో జనసేనకు కెపాసిటీ లేదా లీడర్‌షిప్ కొరత ఉందో, అక్కడ మాత్రమే వైసీపీ నుంచి మెయిన్ లీడర్స్‌ను తీసుకొచ్చి కేడర్‌ను స్ట్రాంగ్ చేస్తున్నారు.

కేవలం ఈ ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాకుండా, ఫ్యూచర్ పొలిటికల్ అవసరాలను, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్‌ను దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ ఈ డోర్లు తెరిచారు. ప్రస్తుతం ఉన్న 21 అసెంబ్లీ స్థానాల నుంచి వచ్చే ఎలక్షన్స్ నాటికి మరింత ఎక్కువ సీట్లలో పోటీ చేసి, ఏపీలో తిరుగులేని లాస్ట్ అండ్ స్ట్రాంగ్ ఫోర్స్‌గా నిలవడమే జనసేన(Janasena Party )అసలు టార్గెట్ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అనారోగ్యం వల్ల పవన్ కొద్ది రోజులు కేరళలో వైద్యం తీసుకోవడానికి వెళ్లడంతో ఆగిన చేరికలు..జనసేనాని మళ్లీ విధుల్లోకి రాగానే స్పీడందుకున్నాయి. మొత్తానికి ఈ వ్యూహాత్మక అడుగులతో లోకల్ పోరు ప్రారంభం ముందే జనసేన పార్టీ(Janasena Party)జనాల్లో ఫుల్ పబ్లిక్ అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తోందని చెప్పొచ్చు.





