Local Body Election Reservation : ఏపీ సర్కార్‌కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు
Local Body Election Reservation : లోకల్ పోరులో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ సర్కార్ తీసుకొచ్చిన 2 వివాదాస్పద జీవోలను కొట్టివేస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చేసిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
Local Body Election Reservation
ఏపీలో ఎప్పటి నుంచో ఉత్కంఠ రేపుతున్న లోకల్ బాడీ ఎలక్షన్ రిజర్వేషన్ల వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన, సంచలన తీర్పును వెలువరించింది. లోకల్ ఫైట్‌లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ సర్కార్ తీసుకొచ్చిన 2 వివాదాస్పద జీవోలను కొట్టివేస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చేసిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం పూర్తిగా డిస్మిస్ చేయడంతో ఏపీ గవర్నమెంట్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోవడానికి ఎలాంటి రీజనబుల్ రీజన్స్ కనిపించడం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ఈ విచారణ సమయంలో అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వంపై కొన్ని ఘాటు కామెంట్లు కూడా చేసింది. రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన 50 పర్సెంటేజ్ రిజర్వేషన్ల మాగ్జిమమ్ లిమిట్‌ని దాటి 34 పర్సంటేజ్ బీసీ కోటా ఇవ్వడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది.

అంతేకాకుండా, రిజర్వేషన్లు ఫైనలైజ్ చేయడానికి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్‌ను పక్కాగా అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తరఫున ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్‌తో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించడానికి చట్టపరమైన మార్గం సుగమమైంది. రాజ్యాంగ నిబంధనలకు లోబడి గరిష్టంగా 50 పర్సెంటేజ్ లిమిట్‌కు అనుగుణంగానే కొత్త రిజర్వేషన్లను ఫైనలైజ్ చేయనున్నారు.
సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడటంతో ఏపీ ఎన్నికల(Local Body Election Reservation) సంఘం (SEC) కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా లోకల్ ఫైట్‌పై వేగంగా అడుగులు వేస్తున్నారు. 50 పర్సెంటేజ్ రిజర్వేషన్లకు లోబడి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్స్(Local Body Election Reservation) ప్రాసెస్‌ను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.మొత్తంగా సుప్రీంకోర్టు తీర్పుతో క్లారిటీ రావడంతో ఏపీలో త్వరలోనే ఎన్నికల సందడి మొదలుకాబోతోంది.
Tanushree Dutta : చల్లారని తనుశ్రీ దత్తా ఈవిల్ డెడ్ కామెంట్ల కాక.. మరణం శాంతించని మీ టూ గాయం..





