Just EntertainmentLatest News

Tanushree Dutta : చల్లారని తనుశ్రీ దత్తా ఈవిల్ డెడ్ కామెంట్ల కాక.. మరణం శాంతించని మీ టూ గాయం..

Tanushree Dutta : ఒక మహిళ మనసులోని గాయం, వేదన మాత్రం కాలంతో పాటు మాసిపోదని తనుశ్రీ కామెంట్లు ప్రూవ్ చేస్తున్నాయి. అదే సమయంలో చనిపోయిన వ్యక్తి పట్ల పాటించాల్సిన సెన్సిటివిటీని మర్చిపోకూడదని సొసైటీ భావిస్తోంది.

Tanushree Dutta

దివంగత సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూశారన్న వార్తతో ఓవైపు బాలీవుడ్‌ శోకసంద్రంలో మునిగి ఉండగానే.. నటి తనుశ్రీ దత్తా(Tanushree Dutta) నానాను ఈవిల్ డెడ్ అని మెన్షన్ చేస్తూ చేసిన కామెంట్ల కాక మాత్రం ఇంకా చల్లారలేదు. ఒక పక్క యాక్టర్‌గానే కాకుండా సోషల్ సర్వీసులోనూ నానా పటేకర్ అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులర్పిస్తుంటే.. మరోపక్క తనుశ్రీ ఇంకా నిన్న కామెంట్లకే కట్టుబడి ఉన్నానని మరోసారి చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2018వ సంవత్సరంలో దేశాన్ని ఊపేసిన మీ టూ ( #MeToo) ఉద్యమానికి తనుశ్రీ దత్తా ఒక మెయిన్ ఫేస్‌గా మారిన విషయం తెలిసిందే. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ సెట్‌లో తన పట్ల లైంగిక వేధింపులు జరిగినట్లుగా చేసిన ఆరోపణలు, ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న కెరీర్ నష్టం, ఎదుర్కొన్న మానసిక వేదన ఆమెకు మాత్రమే తెలుసు.

అందుకే ఒక వ్యక్తి మరణించగానే అతను చేసిన గతం తాలూకా గాయాన్ని, బాధను అంత ఈజీగా మరిచిపోవాలా అని తనుశ్రీ సపోర్టర్స్ ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లుగా వరుసగా కేసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో ప్రలోభాలు , ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన ఒక బాధితురాలి ఆవేదన ఇప్పుడు మరోసారి బయటకు వచ్చిందని..వీలయితే ఆమె రియాక్షన్‌ను అర్థం చేసుకోవాలని కొందరు సమర్థిస్తున్నారు.

అయితే ఇదే సమయంలో నానా పటేకర్ ఫ్యాన్స్, సీనియర్ యాక్టర్లు , అఖిల భారతీయ సినీ కార్మిక సంఘం ( AICWA) సభ్యులు తనుశ్రీ దత్తా(Tanushree Dutta) కామెంట్లపై ఫుల్‌గా ఫైర్ అవుతున్నారు. ఒక వ్యక్తి కన్నుమూసి, తనను తాను సమర్థించుకునే ఛాన్స్ కూడా లేని టైమ్‌లో మినిమం హ్యూమన్ వ్యాల్యూస్ లేకుండా ఇటువంటి పదాలు వాడటం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు.

Tanushree Dutta
Tanushree Dutta

పైగా 2019లోనే సరైన ప్రూఫ్స్ లేవంటూ ఈ కేసులో పోలీసులు క్లోజర్ రిపోర్ట్ సమర్పించిన విషయాన్ని ఇప్పుడు మరోసారి గుర్తుచేస్తున్నారు. ఈ సమయంలో..దశాబ్దాల కాలంగా దేశం గర్వించదగ్గ యాక్టర్‌గా, సోషల్ సర్వీసు ద్వారా సొసైటీకి నానా పటేకర్ చేసిన సేవలను గుర్తు చేసుకోవాలే తప్ప, ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని వాదిస్తున్నారు.

ఏది ఏమైనా, చట్టపరంగా ఎలాంటి ప్రూఫ్స్ లేవని కేసు ముగిసిపోయినా.. ఒక మహిళ మనసులోని గాయం, వేదన మాత్రం కాలంతో పాటు మాసిపోదని తనుశ్రీ కామెంట్లు ప్రూవ్ చేస్తున్నాయి. అదే సమయంలో చనిపోయిన వ్యక్తి పట్ల పాటించాల్సిన సెన్సిటివిటీని మర్చిపోకూడదని సొసైటీ భావిస్తోంది. లీగల్‌ ఫైట్లు, వ్యక్తిగత ఆవేదనల మధ్య మానవత్వపు సరిహద్దులు ఎక్కడ క్లోజ్ అవ్వాలనే దానిపై ఈ సంఘటన మరోసారి సొసైటీ ముందు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మిగిలింది.

Important In A Relationship : ఒకరికొకరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలా?బంధంలో స్పార్క్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Related Articles

Back to top button